ఏపీ రాజదాని ప్రాంతంలో పవన్ కల్యాన్ పర్యటన చాలా ఆసక్తి కరంగా సాగింది. బేతపూడిలో రైతులతో పవన్ కళ్యాన్ ముఖాముఖి మాట్లాడారు . రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న జనసేన అధినేత. భూ సేకరణ చట్టం ప్రయోగిస్తానంటే రైతులు భయపడొద్దు. భూములు లాక్కుంటామంటే నేను మీ వెంటే ఉంటా.

రాజధాని 33 వేల ఎకరాల భూమి అడుగుతున్నారు అవసరమా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి రైతులతో సాదా సీదాగా కింద కూర్చొని ముచ్చటించారు పవన్. వారు తెచ్చిన టిఫిన్ తింటూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పవన్ ను అంత దగ్గర నుంచి చూసిన ప్రజలు తన్మయం పొందారు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. నేను సినిమా యాక్టర్ గా కాదు మీలో ఒకడిగా వచ్చినట్టు పవన్ సింపుల్ గా వారితో మమేకం అయ్యారు.

అంతే కాదు మైకు పట్టుకొని మరీ అక్కడున్న వారి బాదలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయన్నారు. భూములు సంతోషంగా ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏపీ ప్రభుత్వం భూములను బలవంతంగా వత్తడి చేసి ఇవ్వమంలే చూస్తూ ఊరుకోను.

నేనూ రైతు కుటుంబం నుంచి వచ్చినవాన్నే. రైతుల పక్షాన పోరాడుతా.. సమస్య తీరే వరకు అవసరమైతే ఇక్కడే ఉంటా.. రైతుల చే కన్నీళ్లు పెట్టించి సింగపూర్ తరహా రాజదాని అవసరమా..? మా భూములు లాక్కోకుండా చూస్తే జీవితాంతం పవన్ కి రుణపడి ఉంటామంటున్న రైతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: