జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రొజు ఉండవల్లి రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన తీవ్రంగా స్పందించారు. తద్వారా చంద్రబాబుకు తొలి షాక్ అదీ గట్టిగానే ఇచ్చారు. ఉండవల్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నా అనంతరం ఆయన మాట్లాడారు.

మంత్రులు కూ ఉండవల్లి గ్రామస్తులకు ఇచ్చిన నోటీసులు ఆపాలని హెచ్చరించారు. రైతుల కష్టాలు విన్న పవన్ మాట్లాడుతూ తనకు కూరగాయల తోట ఉందని, రైతుల కష్టం తనకు తెలుసునని చెప్పారు. నేను కూడా రైతు కుటుంబం నుండే వచ్చానని చెప్పారు. మీరు స్వచ్చంధంగా భూమి ఇస్తే సంతోషిస్తానని అయన చెప్పారు. ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటే పోరాటం చేస్తానని అన్నారు

ప్రభుత్వానికి కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానని, ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలన్నారు. తామ కూ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని ఎప్పుడొస్తుందో తెలియని పరిహారం కోసం తాము తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టలేమని రైతులు చెప్పారు. తాము భూములు ఇచ్చే పరిస్థితి లేదని వివరన ఇచరు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని మీరు మకు న్యాయం జరిగేలా చూస్తే జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పారు.

మిమ్మల్నే నమ్ముకున్నామని రైతులు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ బీజేపీ టీడీపీ కి మద్దతు పలికినప్పటికీ.. ఆయన టీడీపీ పైన అసంతృప్తితోనే ఉన్నట్లుగా ఊహాగానాలు వచ్చాయి. పవన్ తన పర్యటనలో ఒకవిధంగా ప్రభుత్వాన్ని ఏకిపారేశారని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: