తాను వెళ్లి ప్రత్యేక హోదా పై అడిగితే పని అవుతుందన్న నమ్మకం తనకు లేదని జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ అన్నారు.తాను ప్రశ్నిస్తానని అన్నానని ,అలాగే ప్రశ్నిస్తున్నానని ఆయన చెప్పారు. హోదా రాకపోతే ప్రజా ప్రతినిదుల వైఫల్యం అవుతుందని అన్నారు.తెలుగువారికి ఆత్మగౌరవమని ఆయన అన్నారు.

తాను వెళితే ప్రధాని అప్పాయింట్ మెంట్ దొరుకుతుందా అని అన్నారు.ఎమ్.పిలు కృషి చేయాలని అన్నారు. రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం ఉందా అన్నది తన ప్రశ్న అని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్లు పడుతుందని ఆయన అడిగారు.

ఒకవేళ భవిష్యత్తులో టిడిపి అదికారంలోకి రాకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటని అన్నారు. సింగపూర్ అబివృద్దికి ఏభై ఏళ్ళు పట్టిందని ఆయన అన్నారు. తాను చంద్రబాబు పాలనకు మద్దతు ఇస్తున్నానని ,అయినా భూ సేకరణ చట్టం పై

పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. రాజధాని భూములకు సంబందించి ఇష్టం లేని గ్రామాలను వదలి వేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.రాజధాని గ్రామాలలో తుళ్లూరు లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: