కొత్తగా పెళ్లయిన జంటకు రక రకాల అనుమానాలు ఉంటాయి. మొదట్లో ఇద్దరి మనసులు ఏకం కావడానికి కొంత టైం పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని శృంగార జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు.

మరి తర్వాత పిల్లలపై దృష్టి పెడతారు. మరి పిలల్లు పుడితే తర్వాత జీవితం అంత సుఖమయం ఉండదా అనే అపోహలు కొత్త జంటకు కలగవచ్చు. దీనివల్ల ఏలాంటి బాదరబందీ ఉండదు.. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు పుట్టాక సెక్స్ పై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు సూచిస్తున్నారు.

ప్రధానంగా సిజేరియన్ వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగిలా పడి ఉండవలసి రావడం, కొత్తగా పుట్టిన పాప బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ, ఆ నిర్వహణలో సరిగా నిద్ర పట్టక పోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం లేకపోవడం, ప్రసవానంతరం హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ లాంటివి ఏర్పడుతుంటాయి.

అంతే కాదు ఇంట్లో తలెత్తే సమస్యల వల్ల ఉద్రేకాలకు, ఆందోళనలకు లోను కావడం, చిరాకు, కోపం పెరగడం ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల విముఖత కలిగించవచ్చని చెపుతున్నారు. దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం అనే కారణం కూడా ఈ సెక్స్‌పట్ల విముఖతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. సో... మీరు మీ భాగస్వామి బాధలను అర్థం చేసుకొని లైంగిక జీవితాన్ని అనందించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: