ఓ టీవీ షో బాగా హిట్టేతై ఎన్నాళ్లు కొనసాగుతుంది.. ఏడాది.. రెండేళ్లు.. మహా అయితే.. ఐదేళ్లు.. మరి ఏకధాటిగా ఏడేళ్లకుపైగా ఓ రియారిటీషో సక్సస్ ఫుల్ గా రన్ అవుతుందంటే అది ఆశ్చర్యకరమైన విషయమే. అందులోనూ డైలీ ఎపిసోడ్.. మరి అన్నేళ్లపాటు ఆ షోను విజయవంతంగా నడపడమంటే మాటలు కాదు.. ఇప్పుడు తెలుగు యాంకర్ సుమ ఈ అరుదైన ఘనత సాధించింది.

సుమ.. తెలుగునాట పరిచయం అక్కర్లేని యాంకర్.. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. హోమ్లీగా ఉంటూనే చలకీదనంతో ప్రోగ్రామ్ ను రక్తికట్టిస్తుంది. ఈటీవీలో సుమ నిర్వహిస్తున్న స్టార్ మహిళ కార్యక్రమం.. 2వేల ఎపిసోడ్లు దాటేసింది. అత్యధిక ఎపిసోడ్లకు యాంకరింగ్ చేసిన యాంకర్ గా సుమ ఈ కార్యక్రమంతో జాతీయ రికార్డు సంపాదించేసింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సుమను వరించింది.

ఎనిమిదేళ్లపాటు ఈ ప్రోగ్రామ్ సక్సస్ ఫుల్ గా రన్ చేసిన.. చేస్తోన్న సుమ.. ఈ ప్రోగ్రామ్ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తున్నానని ప్రకటించేసింది. గంటసేపు ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుందంటే.. అందుకు మూడు, నాలుగింతల సేపు రోజూ షూటింగ్ ఉంటుంది. ఒక్కోరోజు 12, 14 గంటలపాటు షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయట.

అందుకే కొత్త వచ్చే యాంకర్ల కోసం.. సుమ ఈ పుస్తకంలో అనేక చిట్కాలు చెప్పబోతోందట. గంటల తరబడి షూటింగ్ చేస్తుంటే.. వచ్చే ఇబ్బందులేంటి.. వాటిని ఎలా అధిగమించాలి.. ఫ్యామిలీని కేరీర్ ను ఎలా బాలెన్సు చేసుకోవాలి.. వంటి అనేక విషయాలు ఇందులో వివరిస్తుందట. కొత్త యాంకర్లకు ఈ పుస్తకం బాగానే ఉపయోగపడుతుంది.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: