విలేకరిపై తిట్లదండకంతో వివాదంలో చిక్కుకున్న భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ మందలించింది. జట్టు గౌరవాన్ని కాపాడుతూ నడుచుకొమ్మని హెచ్చరించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదనే సంకేతాలిచ్చింది.

తన గురించి ఓ విలేకరి అసత్య కథనాలు రాశాడనే కారణంతో పొరపాటున మరో విలేకరిని కోహ్లీ అసభ్య పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ఆ విలేకరి నుంచి ఫిర్యాదు అందుకున్న బీసీసీఐ కోహ్లీని తీవ్రంగా హెచ్చరించింది. జట్టు గౌరవాన్ని కాపాడేలా నడుచుకోవాలని కోహ్లీకి సూచించాం.

భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పాం. ఈ సంఘటన నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇలాంటివి పునరావృతం కాకూడదని మేనేజ్‌మెంట్‌కు కూడా ఆదేశించాం.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఇక లీగ్ కవరేజీపై దృష్టి సారించాలని మీడియాను కోరాం అని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. దూషణకు గురైన ది హిందుస్థాన్ టైమ్స్ విలేకరి కూడా ఈ వివాదం తీవ్రం చేయకూడదని నిర్ణయించుకున్నారు. భారత ప్రపంచకప్ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గొడవను ఇక్కడితో వదిలేస్తున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: