రాత్రి వేళల్లో లేదా నగర శివార్లలోని సంస్థల్లో పనిచేయాల్సి వచ్చే ఉద్యోగాలపై మహిళల్లో విముఖత ఏర్పడిందని ఓ సర్వే వెల్లడించింది. ఈ విభాగాలకు చెందిన కంపెనీల్లో ఉద్యోగినుల సంఖ్య గడిచిన రెండేండ్లలో 26.5 శాతం తగ్గిందని వాణిజ్య మండలి అసోచామ్ విడుదల చేసిన సర్వే వెల్లడించింది.

అంతేకాదు చాలాసేపు ప్రయాణం చేయాల్సి వచ్చే ఉద్యోగాలన్నా స్త్రీలు ఆసక్తి కనబర్చడం లేదని సర్వే తెలిపింది. ఆర్థిక మందగమనంతోపాటు భద్రత ఆందోళనలు తలెత్తడంతో మహిళా ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం చూపెట్టిందని అసోచామ్ అంటున్నది.

ఈమధ్యకాలంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలతో భారతీయ నారీమణుల్లో వ్యక్తిగత భద్రత ప్రధాన అంశంగా మారిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాల్లోని మహిళలు భద్రతపై అధికంగా ఆందోళన వ్యక్తం చేశారట.

అయితే దక్షిణాది నగరాల్లో మాత్రం పరిస్థితి కొంత నయం అని అసోసియేషన్ రిపోర్టు వెల్లడించింది. 20 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న 1,600 మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశంలో మహిళలపై జరిగిన అకృత్యాలకు సంబంధించి 2008లో 3,938 కేసులు నమోదుకాగా.. 2012లో ఈ సంఖ్య 50 శాతం పెరిగి 5,999కు చేరుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: