ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం తుళ్లూరు ప్రాంతంలో భూములను రైతుల నుండి బలవంతంగా లాక్కుంటున్నారు. ఎదురు తిరిగిన రైతులను బెదిరిస్తున్నారు. పంటలు తగుల బెట్టిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల భూములను మాత్రం వదిలేస్తున్న ప్రభుత్వం ఏడాదికి మూడు, నాలుగు పంటలు పండే భూములను లాక్కుంటున్న నేపథ్యంలో అక్కడ తీవ్ర వ్యతిరేకత మొదలయింది. ఈ పరిస్థితిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రంగంలోకి దిగి రైతులకు భరోసా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తరువాత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగి జనసేన మీకు అండగా ఉంటుందని, రైతుల ఇబ్బందులు తొలిగేదాకా తాను విజయవాడలోనే ఉంటానని స్పష్టం చేశాడు.

అసలు రైతుల కన్నీళ్లు పెట్టి కట్టే రాజధాని ఎందుకు ? 30 వేల ఎకరాల రాజధాని అవసరమా ? అని పవన్ ప్రశ్నించాడు. వెంటనే రాజధాని ప్రాంతంలో భూ సేకరణ ఆపేయాలని కోరాడు. అయితే చంద్రబాబు మాత్రం అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో పవన్ తెలుసుకోవాలని, నాలుగులేన్ల రోడ్లు ఉంటే భూములకు గిరాకీ వస్తుంది.

పక్క భూములకు గిరాకీ పెరుగుతుంది. ప్రపంచస్థాయి పరిశ్రమలు వస్తాయి అని అంటున్నారు. అందరూ భూములు ఇస్తున్నారు. ధర ఎక్కువ కావాలి అనుకున్నోళ్లే గొడవ చేస్తున్నారు. వాళ్లు ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తారు ? అని బాబు అంటున్నాడు.

రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు అంతా జగన్ వెంట వెళితే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. దాంతో పాటు ఆందోళనలు పెరుగుతాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోకి వారిని తీసుకువస్తే .. జగన్ అక్కడకు వచ్చే పని ఉండదు. ఏదో సర్ధుబాటు చేసినట్లు చేసి రాజధాని పనిని చక్క బెట్టేయొచ్చు అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనతో భేటీ అయ్యాక పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారని అంటున్నారు. మరి ఇది నిజమా ? అబద్దమా ? అన్నది వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: