ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను ఒక్కసారి రీవైండ్ చేసుకొంటే... తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లు ఇచ్చిన హామీలులో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వాటి అమలు విషయంలో ప్రశ్నిస్తాను అని, వాటి విషయంలో తన పూచీ ఉంటుందని ప్రకటించి వెళ్లాడు పవన్ కల్యాణ్. మరి ఆ పార్టీలే గెలిచాయి.. ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అయితే హామీల అమలు మాత్రం జరగలేదు.

కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు.. భారతీయ జనతా పార్టీ కూడా మాట తప్పింది. ఎన్నికల ముందు ప్రతి ప్రచార సభలోనూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు చాలా కథలు చెప్పారు. ఏపీకి ఐదు పదేళ్లు కాదు.. పదిహేనేళ్ల వరకూప్రత్యేక హోదా అన్నారు. ఇక అప్పటికి ఇంకా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండిన మోడీ ఏపీకి ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని చెప్పారు.

పవన్ కూడా పాల్గొన్న తిరుపతి ఎన్నికల సభలో మోడీ ఈ మాట చెప్పారు. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మోడీ అండ్ కో పిల్లి మొగ్గలు వేస్తోంది. ప్రత్యేక హోదాకు ఏవేవో అడ్డంకులు చెబుతోంది. ఆ అడ్డంకులు మళ్లీ సిల్లీగా అనిపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ నేతలు తప్పించుకోవడానికే ఈ మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తోంది.

మరి ఇప్పుడు పవన్ చేయాల్సిన పనేంటి? హామీల అమలుకు తనే బాధ్యత వహిస్తానన్న ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని.. బీజేపీ నేతలను ఈ విషయంలో నిలదీయాలి. అయితే... ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎంపీలు పోరాడాలి.. ప్రత్యేక హోదా రాకపోతే అది రాష్ట్ర స్థాయి పాలకుల దోషమే అవుతుందని అంటున్నాడు. మరి ఈ మాటలను బట్టి చూస్తే.. పవన్ కూడా మాట తప్పే రకమని.. తను ప్రశ్నించాల్సిన అంశం గురించి ఎంపీలు పోరాడాలి అంటున్న ఆయన కూడా సగటు రాజకీయ నేతేనని స్పష్టం అవుతోంది. దీంతో పవన్ పై ఏమైనా ఆశలుంటే అవి కూడా జావగారిపోయినట్టేనేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: