రంగుల పండుగ అయిన హోలీ ని హిందువులు అత్యంత ఆనందోత్సాహాలతో ఓకరికొకరు రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. ఈ పండుగ వసంత రుతువు ఆగమనానికి చిహ్నం. ఇది ప్రతీ సంవత్సరం ఫాల్గుణ శుద్ద పౌర్ణమి రోజుల వస్తుంది.

కాముని పున్నమి : సతీ వియోగంతో తపస్సు లో ఉన్న శివునికి, హిమవంతుని కుమార్తె అయిన పార్వతినిచ్చి దేవతలు వివాహం చేయ్యాలని పూనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపోభంగం కలిగించాలో అని ఆలోచించిన మన్మధున్ని శివుని మీదకు పంపుతారు. మన్మధుడు తన బాణప్రభావంచే శివుని మనసుని పెళ్లివైపు మరల్చుతాడు. దీనితో పార్వతి, పరమేశ్వరుల వివాహం జరుగుతుంది.

మన్మదబాణ ప్రబావం తగ్గగానే శివుడు తనకు మన్మదుని వల్ల తపోబంగం కలిగిందని గ్రహించి ఆగ్రహోగ్రుడై మూడవ నేత్రంతో మన్మదున్ని భస్మం చేస్తాడు. పతీ వియోగ బారంతో మన్మదుని భార్య రతీదేవి శివున్ని పరిపరి విధములుగ వేడుకోగ శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా కేవలం మానసికంగా బ్రతికే వరం ఈ ఫాల్గుణ శుద్ద పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు.

కాముడు తిరిగి బతికన రోజు కావున దీనిని కాముని పున్నమిగా పిలుస్తారు. మరణించిన మన్మదుడు తిరిగి వచ్చాడన్న ఆనందంతో రతీదేవి మన్మదుడు ఆడుకునే కేళి రంగోళిగా మారింది అప్ప నుంచి ప్రజలు ఆనందోత్సాహాలతో అందరూ సంతోషంగా వివిధ రంగులు గుప్పుకొని సంతోషంగా పండుగ జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: