16 వ శతాబ్దంలో వీటిని భారతదేశంలోకి తీసుకువచ్చారు. దీని జన్మ స్థలం బ్రెజిల్ అయినప్పటికీ పోర్చుగీస్ వారు జీడిమామిడి చెట్టును 1560 మరియు 1565 మధ్య కాలంలో గోవా, భారతదేశానికి తీసుకు వచ్చారు. అక్కడ నుండి మొత్తం ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలకు వ్యాప్తి చెందింది. 1905 జీడిపప్పుని భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న మొదటి దేశం అమెరికా. జీడిపప్పును కాజు అని కూడా పిలుస్తారు. రుచికరమైన వంటకాలు తినడానికి ఎవరైనా ఇష్టపడతారు. అలా వండుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రత్యేక పదార్థాలు కూడా వుంటాయి. వాటిలో జీడిపప్పు కూడా ఒకటి. దీనిని ఏమీ చేయకుండా ఊరికే నోట్లో వేసుకున్నా తినాలనిపించే విధంగా వుంటుంది. జీడి పప్పు మంచి ఔషదం కూడా దీని వల్ల ఆరోగ్య సమస్యలు చాలా దూరమౌతాయి కూడా.

1.గుండె ఆరోగ్యం ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే 'ఒలిక్ ఆసిడ్' కూడా ఇందులో ఉంటుంది. కొవ్వు పదార్థాలను తక్కువగా మరియు యాంటీ-ఆక్సిడెంట్'లను కలిగి ఉండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్ అనే కంటెంట్ గుండె ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది. 2. శరీరంను బలంగా ఉంచుతుంది: జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలు, కండరాలు మరియు నరాలను బలోపేతం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, మనకు రోజుకు 300-750మిల్లీగ్రాముల మెగ్నీషియం అందుతుంది.ఎముకల ఉపరితలంపై మెగ్నీషియం ఒక పూతల ఉండి, కండర కణాలలోకి కాల్షియం ప్రవేశాన్ని నిలిపి, రక్తనాళాలను మరియు కండరాలను విశ్రాంతికి చేసూరుస్తుంది. కానీ శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడినట్లయితే, కాల్షియం రక్తనాళాలలోకి చేరుతుంది.

3. అధిక రక్తపోటును తగ్గిస్తుంది: జీడిపప్పులో ఉన్న పుష్కలమైనటువంటి మెగ్నీషియం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. 4.క్యాన్సర్ ను ప్రమాధాన్ని తగ్గిస్తుంది: జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్స్ అంటే సెలీనియం మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్ ఆక్సిడేషన్ ను నివారిస్తాయి, దాంతో క్యాన్సర్ రిస్క్ ను అరికడుతాయి మరియు వ్యాధి నిరోధకతను పెంచుతాయి. ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది.

5. బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది: జీడిపప్పులో ఉండే అధిక కాపర్ కంటెంట్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, ముఖ్యంగా ఎంజైమ్ యాక్టివిటి, హార్మోన్ ప్రొడక్షన్, బ్రెయిన్ ఫంక్షన్, మొదలగు వాటి క్రియలకోసం ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇంకా అనీమియాను ఎదుర్కోవడానికి అవసరం అయ్యే రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి జీడిపప్పులో ఉండే కాపర్ గ్రేట్ గా సహాయపడుతుంది. 6.జుట్టు ఆరోగ్యానికి: జీడిపప్పులు కాపర్ అనేటటువంటి మినిరల్, ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి కాపర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నా ఈ జీడిపప్పును మీరు తీసుకోవడం వల్ల మీకు నచ్చే బ్లాక్ హెయిర్ ను మీరు సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: