టీమిండియా ఈ వరల్డ్ కప్ బాగా కలిసి వచ్చిందనుకుంటా వరస విజయాలతో ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్‌కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్ 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. విండీస్ టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు వెనుతిరిగారు.

కెప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. గేల్ 21, కార్టర్ 21, సామీ 26, టేలర్ 11 పరుగులకే అవుట్ అయ్యారు. రామదిన్ డకౌటయ్యాడు.

183 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా తంటాలు పడుతోంది. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో భారత్ బ్యాట్స్ మెన్ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నారు. విండీస్ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టి టీమిండియాపై ఒత్తిడి పెంచుతున్నారు.

దీంతో ఏకపక్షం అనుకున్న మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. 38 ఓవర్లలో భారత్ 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. ధోని(34), అశ్విన్(13) క్రీజ్ ఉంటూ భారత్ ను విజయపథంలోకి తీసుకెళ్లి 39.1 ఓవర్లో తో ఆట పూర్తి చేసి భారత్ ను గెలిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: