కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన తెలుగు సినిమా ప్రతిఘటన క్లైమాక్స్ అద్బుతంగా ఉంటుంది. అందులో విలన్లు, చరణ్ రాజ్, కోట శ్రీనివాసరావులు.. క్లైమాక్స్ లో వారి చేతిలో మోసగించబడిన విజయశాంతి చరణ్ రాజ్ ను గండ్రగొడ్డలితో చంపే సీన్ ఉంటుంది. చంపే ముందు.. చరణ్ రాజ్, కోట శ్రీనివాసరావుల గురించి విజయశాంతి సభలో ప్రసంగిస్తుంది. ఆ ప్రసంగంలో వారి మంచితనాన్ని పొగడుతూనే.. తిడుతుంటుంది.

విషయం అర్థంకాని కోట శ్రీనివాసరావు.. పక్కనున్న క్యారెక్టర్ తో తమ్మీ.. పొగడ్తాందా.. తిడ్తాందా.. అని అడుగుతాడు.. పొగుడుతుందని తెలియగానే.. ఆ పొగడ్తాంది.. పొగడ్దాంది.. అని సంబరపడతాడు.. ఈ డైలాగ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. తెలుగు పొలిటికల్ తెరపైనా శుక్రవారం అదే సీన్ రిపీటైంది. గురువారం రాజధాని పర్యటనలో సంచలన వ్యాఖ్యలతో కలకలం సృష్టించిన జనసేనాని శుక్రవారం కూడా ప్రెస్ మీట్ ద్వారా జనం ముందుకొచ్చారు.

సరిగ్గా అన్ని ఛానళ్లలో హెడ్ లైన్లు పడే సమయం చూసి మరీ.. మీడియా ముందుకొచ్చిన పవన్ దాదాపు గంటసేపు మాట్లాడాడు. పవన్ మాట్లాడుతున్నంతసేపు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు,నాయకులు సేమ్ కోట శ్రీనివాసరావులా ఈ తమ్మీ పొగడ్డాండా.. తిడ్డాండా.. అన్న ఆలోచనలోనే ఉండిపోయారు. వారిని పవన్ అంతలా కన్ ఫ్యూజ్ చేసేశాడు..

బాబు పరిపాలన బావుందంటాడు.. భూములు బలవంతంగా తీసుకోవద్దంటాడు.. రోడ్లు మాత్రం వేసుకోనిమ్మంటాడు.. గ్రామాలు ఉండాలంటాడు.. అభివృద్ధి కావాలంటాడు.. ఇలా పరస్పర విరుద్ధమైన కామెంట్లతో పవన్ కన్ ఫ్యూజ్ అయ్యి..జనాలను కూడా కన్ ఫ్యూజ్ చేసేశాడు. బాబును పొగిడినప్పుడు ఆ.. పొగుడుతున్నాడని... మళ్లీ విమర్శించగానే అబ్బో.. తిడుతున్నాడని.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కోటశ్రీనివాసరావులా తలపట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: