అందము,అభినయం,నటనలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకొని తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల పక్కన జంటగా నటించిన అతిలోక సుందరి అదే నండి శ్రీదేవి. శ్రీదేవి ఆగష్టు 13వ తేది 1963వ వత్సరములో శివకాశి (తమిళనాడు రాష్ర్టం)లో జన్మించింది.

ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళంభాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. శ్రీదేవి తన నటనా జీవితాన్ని బాల నటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రం తో మొదలు పెట్టినది. ఆమె యూవ నటిగా తొలుత, ఎక్కువగా తమిళం మరియు, మళయాళం చిత్రాలలో నటించారు.

1976 లో బాలచందర్ చిత్రం "మూండ్రు ముదచ్చు" లో కమల్ హాసన్, రజనీ కాంత్ లతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కోణాలలో నుంచి పరిశీలిస్తే ఆ చిత్రం తమిళ చలన చిత్ర సీమకి పెద్ద గుర్తింపు తెచ్చింది.

తెలుగులో అగ్ర హీరోల సరసన చేసి మెప్పించిన అతిలోక సుందరి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పాపలకు జన్మనిచ్చింది. పెద్ద కూతురు కూడా సినిమాలోకి రావడానికి సన్నద్దం అవుతుంది. ఇప్పుడు శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: