పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు శోభనం రోజు రాత్రి ఒకరికొకరు పరిచయం ఉండక పోవచ్చు ఈ విషయంలో ఒకప్పుడు ఇరువురు సిగ్గు పడుతూ వారి ఏకాంత కాలం కొంత పొడిగించుకునే వారు. నేటి తరం వారు ఏ విషయాల్లోనేనా ఫాస్ట్ మొదటి రోజు భార్యా భర్తలు ఇట్టే కలిసి పోతున్నారు. ఇక సెక్స్ విషయాల్లో కూడా ఇద్దరు తృప్తి పొందేలా ఆనంద లోకంలో తేలుతున్నారు. పురుషుల్లో ఈ సెక్స్ సామర్థ్యం వయసు పెరిగే కొద్ది తగ్గు ముఖం పడుతుంది. పని వత్తడి వల్లో , లేదా ఆరోగ్య సమస్యల వల్లో శృంగారానికి ఆసక్తి చూపలేక పోవచ్చు. మధ్య వయసుకు చేరితే మెల్లగా తగ్గుముఖం పడుతుంది.

దీన్ని నివారించాంటే అనవసరమైన తిండ్లు తినే బదులు అవి పెరగటానికి అవసరమైన సరైన ఆహారాలు తినాలి. తిండి అలవాట్లు మార్చుకుంటే...మీ కామవాంఛ సరైన స్ధాయికి వచ్చేస్తుందంటారు నిపుణులు. అదెలాగో చూడండి. కామ వాంఛను ప్రేరేపించే ఆహారాలు కొన్ని పరిశీలించండి. అరటిపండు - అరటి పండులో బ్రోమేలైన్ ఎంజైమ్ వుంటుంది. అది కామవాంఛను ప్రేరేపించే టెస్టోస్టిరోన్ పెంచుతుంది. ఎంతో శక్తినిస్తుంది. పురుషుల రతి సామర్ధ్యానికి అరటిపండు బాగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన బి ని ఇచ్చే రిబోఫ్లావిన్ వంటివి కూడా సెక్స్ హార్మోన్ల స్ధాయి పెంచుతాయి.

ములక్కాడ - దొడ్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి. అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్ధాయిని పెంచుతాయి. విటమిన్ ఇ కూడా బాగా వుంటుంది. ఇది సెక్స్ హార్మోన్లను ప్రభావితంచేసి మీ సెక్స్ లైఫ్ ను పెంచుతుంది. ములక్కాడ మహిళలకు, పురుషులకు కూడా సెక్స్ సామర్ధ్యం పెంచటంలో దివ్యమైన ఔషధంగా ప్రాచీనకాలంనుండి చెపుతున్నారు. నేటికి చాలామంది తాము తినే చారు, పులుసు లేదా సాంబార్ వంటి వాటిలో ములక్కాడలు ఎంతో రుచిగా తింటారు.

ములక్కాడ కూరగా కూడా వండి తింటారు. అంజీర లేదా అత్తిపండు - అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి. పచ్చటి తులసి - సాధారణంగా ప్రతి ఇంటిలోను తులసి చెట్టు వుంటుంది. దీనిని ఎంతో పవిత్రంగా హిందువులు ఆరాధిస్తారు. తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛను పెంచటమే కాక, జననాంగ వ్యవస్ధను శుద్ధి చేసి సంతానోత్పత్తి కూడా కలిగిస్తుందని వైద్యులు చెపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: