గుజరాత్ లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. వచ్చేనెల 13, 17 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు గడ్కరీ, కేశూభాయ్.. ప్రచారంలో ముందుకెళ్తుంటే.. వీరిని ఎదుర్కోడానికి కాంగ్రెస్ శ్రేణులు ఓ అందాల నటిని తెరపైకి తెచ్చారు. ఆ భామ పేరు తులిక. సాథ్ సాథ్ అనే సీరియల్ తో గుజరాత్ మొత్తం తులిక పాపులర్ అయింది. ఈ పాపులార్టీని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటోంది కాంగ్రెస్.  ఫేస్ బుక్ లోనూ.. గుజరాత్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం అడ్వర్టైజ్ మెంట్లు రెడీ చేస్తోంది తులిక. కొన్నిటికి ఈవిడే స్క్రిప్ట్ కూడా రాసింది. వీటితోపాటు ఫేస్ బుక్ లో ప్రచార పేజీని నడిపిస్తోంది. తులిక ఫర్ గుజరాత్ పేరుతో ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేసిన ఈ అందాల భామ.. మోడీ వైఫల్యాలని ఎండగడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండంటూ.. ఎప్పటికప్పుడు కొత్త ఆర్టికల్స్ అప్ లోడ్ చేస్తోంది. .. అందుకే తులిక గుజరాత్ లో పేరున్న నాయకులు ఎంతోమంది ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం టీవీ ఆర్టిస్ట్ పై భారం వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే.. పార్టీ మాస్టర్ ప్లాన్ మరో రకంగా ఉంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వస్తాయనే ఉద్దేశంతో ఏ ఒక్క నాయకుడినీ కాంగ్రెస్ హైలెట్ చేయడంలేదు. ఎవరో ఒకరిని తెరపైకి తెస్తే.. కులాల వారీగా ఓట్లు చీలిపోతాయని కూడా భయపడుతోంది. అందుకే గుజరాత్ లో కాంగ్రెస్ కి తులిక దిక్కైంది. మరి తులిక గ్లామర్ పార్టీకి ఎన్ని ఓట్లు రాల్చుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: