కోస్తా, కొన్ని తెలంగాణా జిల్లాలను అతలాకుతలం చేసిన నీలం తుఫాను కలుగచేసిన నష్టం అంత ఇంత కాదు. ఇక తమ పనుల్లో తీరిక లేకుండా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా కొందరికి అర్థం కావట్లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలి అయ్యిన తర్వాత గాని మన సిఎంకు తుఫాను భాదిత ప్రాంతాలను సందర్శించే సమయం దొరక లేదు. ఇక ఎందరు రాష్ట్ర మంత్రులు,కేంద్ర మంత్రులు ఈ ప్రాంతాలలో పర్యటన జరిపారో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒక విధంగా ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ పనితీరుకి దర్పణం పడుతాయి. 1996 లో కోస్తా ప్రాంతానికి అపార నష్టం కలుగ చేసిన పెను తుఫాను సమయంలో చంద్ర బాబు మొత్తం అధికార గణాన్ని , ప్రభుత్వ పాలను రాజముండ్రి ప్రాంతానికి తరలించి ఎలా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిన్చాడో ప్రజలు గుర్తుచేసుకుం టున్నారు . ఆనాడు తుఫాను ఇంకా భీభత్సాన్ని సృష్టించినా అన్ని శాఖల సమన్వయంతో ఎలా ప్రజలకు మేలు చేసింది ఇప్పటికీ గుర్తే. కిరణ్ కుమార్ రెడ్డి కనీసం క్షేత్ర స్థాయి పర్యటనకు కూడా వెళ్ళలేదు. మరి దీని గురించి అనుమతి తీసుకోవడానికి ఢిల్లీ కి ఒకసారి వెళ్లి సోనియా పర్మిషన్ ఇచ్చాక వస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: