తాగుబోతులని అందరినీ ఒకే గాటన కట్టేస్తారు కానీ.. తరచి చూస్తే ఆ మందుబాబుల్లోనూ ఎన్నో వర్గాలుంటాయి. మందంటే ఒకటా రెండో ఎన్నో రకాలు.. నాటుసారా మొదలు కొని ఫారిన్ స్కాచ్ వరకూ అందులో ఎన్నో గ్రూపులు.. నాటుసారా, కల్లు, సారా, బీరు, హాట్ , విస్కీ, రన్, జిన్.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే మందుపురాణం చాలా పెద్దదే అవుతుంది.

మిగిలిన వాటి సంగతి పక్కకు పెడితే.. బీరు రుచి సాధారణంగా ఒకేలా ఉంటుంది. వగరుగా ఉండే బీరును కూల్ లేకపోతే ఏమాత్రం తాగలేం.. చిల్డు బీరును మూత కొరికేసి ఒక్క గుక్కలో బాటిల్ ఖాళీ చేసే బీరుబాబులు కూడా చల్లగా లేకపోతే.. సింగిల్ సిప్ కు కూడా ముఖం చిట్లించేస్తారు.

బీరులో కొత్త రుచులు క్రియేట్ చేసేందుకు.. ఉత్తత్తి ప్రక్రియ స్పీడప్ చేసేందుకు వీలుగా హైబ్రిడ్ ఈస్టును కనుగొనడంలో.. ఫిన్లాండ్ సైంటిస్టులు సక్సస్ అయ్యారు. శతాబ్దాల తరబడి బీరు ఉత్పత్తిలో ఈస్టులోని కొన్ని రకాలనే ఉపయోగిస్తున్నారు. అదే విస్కీ, వైన్, ఏల్, సిడర్ ల ఉత్పత్తిలో మాత్రం విస్తృత స్థాయిలో ఈస్టు రకాలను ఉపయోగిస్తున్నారు. వీటి తయారీలో భిన్న రుచుల తయారీకి ఆస్కారం ఏర్పడుతోంది.

ఈ హైబ్రిడ్ ఈస్టుల అభివృద్ధితో ఇక కొత్ర రకం రుచులు తయారు చేయబోతున్నారన్నమాట. ఈ కొత్త ఈస్టులు.. కిణ్వన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఈథనాల్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి వెరైటీలు చేయాలంటే.. జన్యుమార్పిడి టెక్నాలజీ వాడాలి. బీరులో కొత్త రుచులకు ఆ అవసరం కూడా లేదంటున్నారు. సో.. బీరు బాబులూ ఇక కొత్త రుచుల కోసం తయారుగా ఉండండి..

మరింత సమాచారం తెలుసుకోండి: