తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు తర్వాత స్థానం దేవేందర్ గౌడ్ దే. ఆవిర్భావం నుంచీ పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర వహించిన దేవేందర్ గౌడ్ గత కొన్నిరోజులుగా తెరమరుగయ్యారు. చంద్రబాబు వస్తున్నామీకోసం యాత్ర సొంతజిల్లా రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన నేపథ్యంలో అన్నీ తానై నడిపించాల్సిన దేవేందర్ పాదయాత్రలో కనిపించడం లేదు. పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన దూరంగా ఉండడం టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది.  అనారోగ్యానికి గురైన దేవేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ ఇంటి ముందు గేటుకు కుటుంబ సభ్యులు తాళాలు వేసారు. పార్టీ ప్రముఖులు ఎవరు ఫోన్ చేసినా.. తర్వాత మాట్లాడిస్తామంటూ చెబుతున్నారు. తెలుగుదేశం నేతలెవరికి అందుబాటులో లేకుండా ఉన్నారు. దీంతో దేవేందర్ గౌడ్ అనుచరులు ఆందోళనలో పడ్డారు. ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడానికి కారణం అనారోగ్యమే అని తెలుస్తోంది. చికిత్సకోసం దేవేందర్ అమెరికా వెళ్లనున్నారు. పార్టీ కార్యకలాపాలకు దూరం గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న దే డు కూడా చంద్రబాబును పరామర్శించేందుకు దేవేందర్ కు బదులుగా ఆయన కుమారుడు వెళ్లారు. రంగారెడ్డి జిల్లాలో బాబు పాదయాత్ర ప్రారంభించగానే దేవేందర్ ఆయనకు ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు. శుక్రవారం రాత్రి చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్టు బాబుకు చెప్పారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని బాబు చెప్పినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో బాబు యాత్రను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు చెబుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో కీలక నేత అయిన దేవేందర్ గౌడ్ అండ లేకపోవడం బాబుకు కొంతవరకు ఇబ్బంది కలిగించే అంశమే.

మరింత సమాచారం తెలుసుకోండి: