డిజిటైజేషన్ అఫ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా నగరవాసులకు, సామాన్యులకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సమస్యలకు అందుబాటులో వచ్చినప్పుడే అది ఉపయోగం అవుతుందని, దానిని సక్రమంగా సద్వినియోగపర్చుకోవాలని, అందుకే మీసేవా ద్వారా 31 సర్టిఫికేట్లను దళారీలు లేకుండా అందజేయడం ఇంతవరకు కొన్ని జిల్లాల్లో జరుగుతుందని, ఈ పథకాన్ని ఈ ఏడాది కల్లా 100 సర్వీసులకు విస్తరించటమవుతుందని తెలిపారు. బిజెపి సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ హైదరాబాద్ మహా నగరాన్ని నివాసాలు, వాణిజ్య వ్యాపార సంస్థల వివరాలతో డిజిటైజ్ చేయడం వల్ల స్థానికుల చిరునామా సునాయాసంగా తెలుసుకోవటంతో పాటు మోసాలను అరికట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. శాసనమండలిలో విప్లు వై.శివరామిరెడ్డి రుద్దరాజు పద్మరాజు, శాసనసభ్యులు ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎపి మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సంస్థ ఛైర్మన్ పసుపులేటి రమేశ్ బాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: