వైద్యశాస్త్రం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఒక మనిషి కిడ్నీని మరొకరికి పెట్టడమే పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ లా ఉండేది. అప్పట్లో ఆ నేపథ్యంలో విజేత వంటి సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కిడ్నీతో పాటు ఏకంగా గుండె కూడా సింపుల్ గానే మార్చేస్తున్నారు.

తాజాగా మరో అడుగు ముందుకేసిన వైద్యులు.. ఇప్పుడు ఏకంగా పురుషాంగాన్ని కూడా మార్చేస్తున్నారు. వైద్య చరిత్రలో ఇదొక అరుదైన ఆపరేషన్ అని చెప్పకతప్పదు. ఈ రేర్ ఆపరేషన్ దక్షిణాఫ్రికాలో జరిగింది. సున్తీ వల్ల వచ్చిన ఇన్ ఫెక్షన్ కారణంగా ఓ కుర్రాడి పురుషాంగం పనికిరాకుండా పోయింది. అతనికి మరో వ్యక్తి పురుషాంగాన్ని దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో విజయవంతంగా అమర్చారు.

దక్షిణాఫ్రికాలో అనారోగ్యకర వాతావరణంలో జరిగే సున్తీల కారణంగా పురుషాంగాలకు ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయట. ఏడాదికి కనీసం 250 మంది వరకూ కుర్రాళ్లు తమ పురుషాంగాలు కోల్పోతున్నారట. ఇప్పుడు ఈ ఆపరేషన్ వారిలో ఆశలు చిగురింపజేస్తోంది. మరణించిన వ్యక్తుల కళ్లు, గుండె, కిడ్నాలు దానం చేసినట్టే పురుషాంగం కూడా దానం చేయవచ్చట.

యుక్తవయస్సులో జరిగే ఈ సున్తీల కారణంగా లేతవయస్సులోనే కుర్రాళ్లు తన అంగాలు కోల్పోతున్నారు. పురుషాంగం లేని బతుకెందుకంటూ చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారట. ఇప్పుడు ఈ ఆపరేషన్ విజయవంతం కావడం అలాంటి వారి జీవితాల్లో ఓ కీలక మలుపు కాగలదని వైద్యులు చెబుతున్నారు. పురుషాంగ మార్పిడి కోసం గతంలో చైనాలో ప్రయత్నాలు జరిగినా అవి సక్సస్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: