ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడి చోటుచేసుకుంది. అసెంబ్లీలో సాగాల్సిన ప్రతిపక్షనేత ప్రసంగం తొలిసారిగా ప్రెస్ మీట్లో సాగింది. అసెంబ్లీ మైకు ముందు అధ్యక్షా.. అంటూ సాగవలసిన ప్రతిపక్షనేత బడ్జెట్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా జనం చూడాల్సివచ్చింది. అసెంబ్లీలో తనను మాట్లాడనివ్వడంలేదని అలిగిన జగన్.. వైఎస్సార్ పార్టీ ఆఫీసులో ప్రసంగించారు.

జగన్ ప్రసంగం.. ఆయన మాటల్లోనే.. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెపారు. జాబు రావాలంటే బాబు రావాలని గోడల నిండా రాశారు. ప్రతి మీటింగులోనూ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చంద్రబాబు సంతకం చేశారంటూ లేఖలు ఇంటింటికీ పంచారు.. ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చారు.

ఒక్క రైతు రుణాల విషయంలోనే అనేక షరతులు పెట్టి రైతుల ఉసురుపోసుకుంటున్నారు. వాస్తవానికి రైతుల వడ్డీకి 12 వేల కోట్లుఇవ్వాలి.. ప్రభుత్వం కేటాయించింది కేవలం 170 కోట్లు.. రైతులకు 14శాతం వడ్డీ పడుతోంది.. ఇలా ఒక్క రైతు రుణాల విషయమే కాదు.. అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను విలేకరుల సమక్షంలో ఎండగట్టారు. విషయాలలెక్కలతో రైతుల దుస్థితిని జగన్ వివరించారు. ఉదాహరణగా.. అనంతపురం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు రైతుల కేస్ స్టడీలు కేస్ స్టడీలు వివరించారు. ఈనాడు పత్రికలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు.. మీ అధికార గెజిట్ రాసింది సార్ అంటూ సెటైర్ వేశారు.

బాబు రుణ మాఫీ కారణంగా.. రైతులు రుణ విముక్తులవడం సంగతి అటుంచి.. కొత్త అప్పులు పుట్టక ఇబ్బందులపాలవుతున్నారని జగన్ విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి సీమాంధ్ర ముఖ్యమంత్రి అవుతారు కానీ.. హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్ర రైతుకు మాత్రం రుణమాఫీ చేయరని లాజిక్ పాయింట్ లాగారు.. టైమైపోయింది.. కంక్లూడ్..కంక్లూడ్.. అని చీటికీ మాటికీ అడ్డుచెప్పే స్పీకర్ లేకపోవడంతో.. జగన్.. ఇలా తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: