ప్రతిపక్షనేత జగన్ వ్యవహారశైలిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్ చాలా పెద్ద ఇగోయిస్టు అని చెబుతుంటారు. వయసులో ఎంత పెద్ద నేతనైనా ఆయన్న సార్ అనే పిలవాలని ఆయన కోరుకుంటారట. అలా పిలవని వాళ్లను దూరం పెడతారట. గతంలో సినీనటుడు రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా తన పక్కన టిప్ టాప్ గా టక్కులు వేసుకుని నిల్చోవద్దని చెప్పినట్టు ఓ కథ ప్రచారంలో ఉంది. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం.. ఆయనకు ఎదురు చెప్పే సాహసం చేయరు.

వైఎస్ పై ఎంత అభిమానం ఉన్నా.. జగన్ వ్యవహారశైలి నచ్చకే చాలామంది నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారని చెబుతారు. జగన్ వ్యవహార శైలికి సంబంధించిన పైన చెప్పినవన్నీ పుకార్లు.. ప్రచారాలు మాత్రమే.. కానీ శుక్రవారం జగన్ ఇగోయిజం ఏంటో మీడియా సాక్షిగా బయటపడింది. అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదని జగన్ మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా మాట్లాడారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండున్నర గంటల సేపు ఆయన ఏకధాటిగా ప్రెస్ మీట్ కొనసాగించారు.

అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆయన ప్రెస్ మీట్ కొనసాగుతున్నంత సేపు.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఆయన చుట్టూ నిల్చోవడం విశేషం. పాపం.. ఎవరైనా కదలకుండా మెదలకుండా.. గ్యాప్ లేకుండా.. రెండున్నర గంటలు నిల్చోవడం అంటే ఎంత కష్టం.. అసలు జగన్ మీడియా సమావేశంలో వాళ్లు జగన్ చుట్టూ నిల్చోవాల్సిన అవసరం ఉందా.. వాళ్లు నిల్చున్నా.. పోనీ జగనైనా కూర్చోండని చెప్పొచ్చుగా..

ఇప్పుడు ఈ అంశాన్ని కూడా టీడీపీ వాడుకుంటోంది. జగన్ వైఖరిలో రాచరికపుపోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. దానికి ఈ ఘటనే ఉదాహరణ అని మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. మూడు గంటల పాటు జగన్ దర్జాగా కుర్చీలో కూర్చొని.. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను నిల్చోబెట్టడం ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి ఉదారణ అని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: