ప్రతి రాజకీయ నాయకుడికీ కొన్నిప్లస్ పాయింట్లు.. మరికొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. తమ ప్లస్ పాయింట్లను వీలైనంతగా ఎక్కువగా ఉపయోగించుకుని... మైనస్ పాయింట్ల ప్రభావాన్నిసాధ్యమైనంతగా తగ్గించుకున్నవాడే విజయవంతమైన నాయకుడవుతాడు. ఆంధ్రా సీఎం చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన రూపం ఆయనకో మైనస్ పాయింట్.

చంద్రబాబు చూడగానే ఆకట్టుకునే రకం కాదు.. ఇప్పుడంటే అలవాటైంది కాబట్టి బాగానే కనిపిస్తున్నారు కానీ.. ఎన్టీఆర్ ను దించేసి సీఎం అయిన మొదట్లో బాబు గారి రూపం ఇంకా దారుణంగా ఉండేది. కాకపోతే.. ఆయన తన పనితీరుతో అన్నింటినీ అధిగమించారనే చెప్పాలి. క్రమశిక్షణ, అకౌంటబిలిటీ, మీడియా మేనేజ్ మెంట్, పక్కా ప్లానింగ్ వంటి సుగుణాలతో ఆయన అత్యధిక కాలం ఏపీని పాలించిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.


చంద్రబాబు మరో మైనస్

Image result for Chandrababu

చంద్రబాబు మరో మైనస్ ఆయన ప్రసంగించే తీరు కూడా. ఏమాత్రం ఇంట్రస్ట్ కలిగించకుండా.. మాడ్యులేషన్ ఏమాత్రం మార్చకుండా.. ఆ విధంగా ముందుకెళ్తామంటూ ఆయన మాట్లాడుతూనే ఉంటారు. కాకపోతే.. అది ఏ సభైనా.. ఏ టాపిక్ అయినా గంటల తరబడి ప్రసంగించడం ఆయనకున్న ప్లస్ పాయింట్ కూడా. ఉపన్యాసం కానీ, ప్రెస్ మీట్ కానీ మొదలుపెట్టారంటే ఒక పట్టాన ముగించరు. చెప్పిందే చెప్పి.. హింసిస్తున్నారని పాత్రికేయులు బోర్ ఫీలైనా.. బాబు మాత్రం తాను అనుకున్నట్టు గంటల తరబడి మాట్లాడేస్తారు.


జగన్ కోసం ఎదురుచూస్తే


అయితే.. ప్రతిపక్షనేత జగన్ తీరు అందుకు విరుద్ధం కీలకమైన సభల్లోనూ కేవలం పావుగంటో, అర్థగంటో మాట్లాడేసి ముగించేస్తారు జగన్. ఆమధ్య విశాఖ బహిరంగసభలోనూ అంతే.. జనం గంటల తరబడి జగన్ కోసం ఎదురుచూస్తే.. ఆయన మాత్రం పది నిమిషాలే మాట్లాడారు. ఆయన కూడా ఇప్పుడు తన తీరు మార్చుకుంటున్నట్టున్నారు. శుక్రవారం ఆయన ప్రెస్ మీట్ అందుకు ఉదాహరణ. దాదాపు మూడు గంటల సేపు నాన్ స్టాప్ గా సాగిన ఆయన ప్రసంగం ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ గంటా, రెండు గంటలపాటు మాట్లాడిన బాబు ప్రసంగమే లాంగెస్ట్ అనుకుంటే.. జగన్ ఏకంగా రెండున్నర - మూడు గంటలసేపు ప్రసంగించి.. బాబు రికార్డు బద్దలుకొట్టేస్తారు. కానీ బాబు తలచుకుంటే.. ఈ రికార్డు బద్దలు కావడం పెద్ద కష్టమేం కాదు..


మరింత సమాచారం తెలుసుకోండి: