ఏపీ సీఎం చంద్రబాబుకు మనవడు.. పుట్టాడు.. నందమూరి వారింటి బాలయ్య ఇలాకాలో మునిమనవడు వచ్చేశాడు.ఉగాది పండుగ రోజు.. అందులోనూ పండంటి మగబిడ్డ.. అందుకే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో, నందమూరి అభిమానుల్లో ఇదో హాట్ టాపిక్. వారి ఆనందానికి పట్టపగ్గాల్లేవు.
 
అప్పుడే నారా వారి బుడ్డోడి నామధేయంపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. తాత తారక రాముని పేరు కలసి వచ్చేలా పెట్టే అవకాశాలున్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. చంద్రబాల నాయుడు అని.. బాల చంద్ర అని ఇలా వెరైటీ వెరైటీ పేర్లు ఊహించుకుని ఆనందపడుతున్నారు ఫ్యాన్స్..
 
ఈ సమయంలో నారా చంద్రబాబు మనవడికి పేరు పెట్టేశారు. ఇంతకీ పేరు పెట్టింది నారా, నందమూరి కుటుంబాల వారు కాదండోయ్.. సాధు సంతులు.. వీరెందుకు పేరు పెడుతున్నారా అనుకుంటున్నారా.. దానికీ ఓ కథ ఉంది.విజయనగరం జిల్లాలోని రామతీర్థలో అధికారికంగా శ్రీరామనవమి వేడుకలు జరపాలని వారు కోరుతున్నారు. దానికోసం న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. కోర్టుకెక్కారు. కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
 
ఉగాది వేళ ముఖ్యమంత్రికి మనవడు పుట్టడం శుభపరిణామమంటున్న సాధుసంతులు... అది కచ్చితగా రాముని దయవల్లేనే సాధ్యమైందంటున్నారు. అందుకే నారా వారి బుడ్డోడికి రాముని పేరు పెట్టమని సలహా ఇస్తున్నారు. తనకు ఇంత శుభం చేకూర్చిన రాముని గురించి చంద్రబాబు కూడా ఆలోచించాలని... ఇకనైనా రామతీర్థలో శ్రీరామ కళ్యాణం నవమి నాడు జరిపించాలని కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: