రామోజీరావుకు, చంద్రబాబుకు ఉన్న అనుబంధం గురంచి తెలుగు రాజకీయాలు ఫాలో అయ్యేవారికి ఓ అవగాహన ఉండే ఉంటుంది. రామోజీ చంద్రబాబుకు రాజగురువుగా కొన్ని పేపర్లు వ్యంగ్యంగా రాస్తుంటాయి. ఎన్టీఆర్ ను ఎదిరించిన ఎపిసోడ్ నుంచీ లేటెస్టు ఎన్నికల వరకూ రామోజీ అండదండలతోనే చంద్రబాబు బండిలాక్కురాగలుగుతున్నాడని ఓ టాక్. 

ఎన్టీఆర్ ను ఎదిరించిన ఎపిసోడ్



కాంగ్రెస్ వ్యతిరేకతతోపాటు చంద్రబాబుపై అభిమానం కూడా రామోజీ మీడియాలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అయితే రామోజీ, బాబు అనుబంధం గురించి వాళ్లూ వీళ్లూ చెప్పుకోవడమే గానీ ప్రత్యక్షం చూసినవారెవరున్నారు చెప్పండి.. కానీ తాజాగా ఓ ఉదంతం మాత్రం రామోజీ చెప్పినదాన్ని బాబు ఫాలో అయ్యారని రుజువు చేస్తోంది. అదే ఆంధ్రా రాజధానికి పేరు పెట్టే విషయం.

ఆంధ్రా రాజధానికి అమరావతి అన్నపేరు అన్నివిధాలా బావుంటుందని రామోజీ తన పత్రికలో తన పేరుతోనే ఓ వ్యాసం రాశారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై రామోజీ తన పేరుతో వ్యాసాలు రాయరు. అలాంటిది ఆయన పని కట్టుకుని ఓ విశ్లేషణాత్మక వ్యాసం రాస్తే.. బాబు అందుకు స్పందించరా..?

ఆంధ్రా రాజధానికి అమరావతి అన్నపేరు



రామోజీ లేఖ ఫలితమే.. కాదో తెలియదు కానీ.. ఏపీ రాజధానికి ఇప్పుడు అమరావతి అన్న పేరే ఖరారైందని తెలుస్తోంది. ఆ పేరును చంద్రబాబు ఖరారు చేశారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని కొందరు మంత్రులే మీడియాకు లీకులిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధుల నోట కూడా ఈ మాటే వినిపిస్తోంది. ఈపేరు ఉగాది రోజే ప్రకటించాల్సిఉన్నా.. కాస్త ఆలస్యమవుతోందట. లేటైనా పేరు మాత్రం అమరావతేనట.



మరింత సమాచారం తెలుసుకోండి: