ఈ మధ్య టీడీపీ నేతలకూ.. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. అసెంబ్లీలో మంత్రి పీతల సుజాత నుద్దేశించి రోజా చేసిన సైగలు, కాలి చూపించడాలు, బుర్ర చూపిస్తూ కామెంట్ చేయడాలు సంచలనానికి దారి తీశాయి. అధికారపక్షం కూడా కేవలం రోజా, వైసీపీ నేతలకు సంబంధించిన క్లిప్పింగలే లీక్ చేయడం కూడా వివాదం సృష్టించాయి.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా వంటి నేతలు.. రోజాపై నిప్పులు చెరుగుతున్నారు. అంతే కాదు.. బోండా ఉమ అయితే ఏకంగా రోజాకు సంబంధించిన వీడియోలు తన దగ్గరున్నాయని వాటిని బయటపెడతానని బెదిరించాడు. బెదిరించడమే కానే.. వాటిని బయటపెట్టలేదు. 


సుజాత కూడా మరోసారి రోజా వీడియోలపై


ఇదే సమయంలో తాజాగా రోజాపై నిప్పులు చెరిగిన మంత్రి పీతల సుజాత కూడా మరోసారి రోజా వీడియోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రోజా వీడియోలు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పీతల సుజాతనుద్దేశించి అసెంబ్లీలో రోజా.. ఒళ్లు పెంచుకోవడం కాదు.. బుర్ర పెంచుకోవాలన్నట్టుగా సైగలు చేశారు. దీనిపైనా మంత్రి సుజాత ఫైరయ్యారు. 


రోజావి అలాంటి వీడియోలున్నాయా


తన బుర్ర ప్యాకేజీలు ఒప్పుకోమని చెప్పదని.. పార్టీలు మారమని చెప్పదని.. ఇన్ డైరెక్టుగా రోజాను ఎటాక్ చేశారు. అంతటితో ఆగకుండా.. తన బుర్ర తాగి పిచ్చిపిచ్చి డాన్సులు చేయమని కూడా చెప్పదని ఎద్దేవా చేశారు. అంటే రోజా తాగి పిచ్చిపిచ్చిగా డాన్సులు చేసిందనేగా.. అటు బోండా ఉమ కానీ.. ఇటు పీతల సుజాత కానీ.. రోజా వీడియోలు ఉన్నాయంటున్నారు కానీ.. వాటిలో ఏముందో చెప్పడం లేదు. పీతల సుజాత మాటలను బట్టి చూస్తే.. రోజా తప్పతాగి పిచ్చి డాన్సులు వేసిందని అర్థం చేసుకోవాలి. మరి నిజంగా రోజావి అలాంటి వీడియోలున్నాయా.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: