మనిషి ముప్పయి సంవత్సరాలు దాటిన తర్వాత రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి అవి ఆరోగ్య పరంగానైనా కావచ్చు, వృత్తిపరంగానైనా కావొచ్చు దీంతో విసుగు, కోపం, ఆవేశం లాంటి చోటుచేసుకుంటాయి. అలాగే వ్యక్తి తన వయసు మీద పడుతున్నాకొద్ది ఆలోచనతో డిప్రెషన్ కి కూడా గురిఅవుతుంటాడు. మరి పూర్వ కాలంలో దాదా 50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనిషి చెక్కు చెదరకుండా నిత్య యవ్వనుడిలా ఉంటూ మంచి ఆరోగ్య వంతులుగా ఉండేవారు కారణం వారు తీసుకునే ఆహారం. మరి నేటి నవీన కాలంలో అలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించలేక పోతున్నాం.


తేనెతో తొమ్మిది రకాల ఉపయోగాలు 

 

మరి ఇలాంటి ఇబ్బందులు పోయి చక్కటి ఆరోగ్యంతో నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈవిధంగా చేయండి.

అయితే రోజువారీ డైట్‌లో తేనెను చేర్చుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్ల రసాల్లో 40 నుంచి 80 శాతం వరకు చక్కెర ఉంటుంది. ద్రాక్షలో పంచదార 10 నుంచి 30 శాతం, చెరకు రసంలో 1 నుంచి 90 శాతం వరకు షుగర్ కంటెంట్ ఉంటుంది. అందుచేత పండ్లరసాల్లో చక్కెర కంటే తేనెను వాడటం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తేనెలో మెగ్నీషియం, క్యాల్షియం, క్లోరిన్, పొటాషియం, ఫాస్పరస్, అల్యూమినియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. 

 తేనెలోని ఆరోగ్య ప్రయోజనాలు: 

తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేనెను వేడినీటిలో కలుపుకుని తాగితే బరువు తగ్గుతుంది. శరీరం దృఢమవుతుంది. 

తేనెలో నిమ్మరసం కలుపుకుని తాగినే వేవిళ్లు, జలుబు, తలనొప్పి దూరమవుతుంది. 

తేనెలో ఉల్లిరసం కలుపుకుని తాగితే కంటి దృష్టి మెరుగవుతుంది. 

తేనె, కోడిగుడ్డు, పాలు కలుపుకుని తాగితే ఆస్తమా వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. 

రక్తహీనతకు చెక్ పెట్టాలంటే పాలలో తేనె కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. 


 

ఒక గ్లాసుడు వేడి నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని అందులో సగం పండు నిమ్మరసం చేర్చి  రోజూ తీసుకుంటే ఎప్పుడూ చురుకుదనం చేకూరుతుంది. జలుబు నుంచి విరుగుడు లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని పరగడుపున, నిద్రించేముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అల్సర్‌తో బాధపడేవారు రోజూ ఒక రెండు టీ స్పూన్లు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: