గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ఇందిరాసాగర్‌ పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన తాజా అంచనాలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించిన నేపథ్యంలో గత వారంరోజులుగా జలవనరుల శాఖ అధికారులు పోలవరం పనుల అంచనాల సవరణ పనుల్లో నిమగ్నమయ్యారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక అంచనాలు, జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేనాటికి జరిగిన వ్యయం, పూర్తయిన పనులు, మిగులు పనులు, వాటికి చేయాల్సిన ఖర్చులు, పెరిగిన సిమెంట్‌, స్టీల్‌ తదితర వాటి ధరలు తదితర అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఈ నెల చివరినాటికి ఇది పూర్తిచేసి తాజా అంచనాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేయనున్నారు. అయితే.... పోలవరం పనులు వేగవంతానికి కేంద్రం ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోగానే ఏడాది కాలంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని బీరాలు పలుకుతోంది. అంతేకాదు... అందుకుగల సాధ్యాసాధ్యాలపై అనుమానాలు లేవనెత్తుతున్న విపక్షాల గొంతు నొక్కుతోంది. పారదర్శకత  పాటించడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. 

పోలవరం పనులు వేగవంతానికి కేంద్రం ఒకవైపు ప్రయత్నాలు


అయితే, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సాగునీటి పథకాలు ఏవీ అనుకున్న సమయానికి పూర్తయనట్లు చరిత్రలో లేదు. అంచనాలు పెరిగిపెరిగి దశాబ్దాలు గడిచినా ఖర్చు రెండు మూడు రెట్టవడమేకానీ సగం కూడా పూర్తి కాని ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ దశలో పోలవరాన్ని కేంద్రం టేకప్ చేయడంతో దీని విషయంలో అలాంటి పరిస్థితి ఉండకపోవడచ్చని.. వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తారని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏడాదిలో పూర్తి చేస్తామని చెబుతున్నా అందుకు కూడా రెండు మూడేళ్లు పట్టొచ్చని పేర్కొంటున్నారు.  దీంతో పోలవరమే పూర్తయ్యే తరుణంలో ఇంకా పట్టిసీమతో ప్రయోజనమేంటన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ పోలవరాన్ని శరవేగంతో పూర్తి చేసి పట్టిసీమ ప్రయత్నంలో ఉన్న చంద్రబాబుకు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.


ఇటీవల జరిగిన పోలవరం అథారిటీ సమావేశం లో తీసుకున్న నిర్ణయాల మేరకు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలో అంచనాల సవరణ పనులు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పొలవరం గ్రామం వద్ద గోదావరి నదిపై చేపట్టిన పోలవరం ప్రాజెక్టును రూ.16,010కోట్ల అంచనాలతో రూపొందించారు. ఈ పథకం పనులపై ఇప్పటివరకూ సుమారు రూ.5వేల కోట్లు ఖర్చు చేశారు. అందులో అత్యధికంగా పోలవరం ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంపైనే ఖర్చు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజిదాక కుడికాలువ నిర్మాణ పనులకు సంబంధించి 80శాంతం పూర్తయ్యాయి. గోదావరి నదిపై హెడ్‌వర్క్స్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన పనులకు సంబంధించి పిలిచిన టెండర్లు వివాదాస్పదం కావటంతో టెండర్ల ప్రక్రియ ఖరారులో జాప్యం పోలవరం పథకం పనుల ప్రణాళికను మందగింపచేసింది.  కేంద్రం పోలవరం పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ పథకం పనులన్నింటినీ పోలవరం అథారిటీకి అప్పగించటంతో పోలవరం పథకం పనుల్లో వేగం వస్తోంది. ఇటీవల జరిగిన పోలవరం అథారిటీ తొలి సమావేశంలో ఈ పథకం పనులకు సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించారు. 2010-11 అంచనాల మేరకు పోలవరం పథకం నాలుగేళ్లలో పూర్తి కావాల్సి వుంది. 2018 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోంది


 కేంద్రం పోలవరం పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం. 


పైగా పోలవరం పథకం పూర్తి కావాలంటే తాజా అంచనాల మేరకు సూమారు రూ.16వేల కోట్లు అవసరం. ఏపీలో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీకి ఆ మొత్తం ఖర్చు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా పట్టిసీమ ఎత్తిపోతలపై రగడ జరుగుతుండడంతో బీజేపీ ఇదే అదనుగా దాంతో సమానంగా పోలవరాన్ని పూర్తి చేసి టీడీపీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలవరానికి మంచి రోజులొచ్చాయని.... పట్టిసీమ ఎత్తిపోతల ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అభాసుపాలై చివరకు జగన్ వాదనే కరెకట్టవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: