జనహితం నా అభిమతం.. ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘జనసేన’ అనే పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలుసు. మరి పార్టీ స్థాపించినప్పటికీ ఆయనకు ఉన్న ఇమేజ్ తో సార్వత్రిక ఎన్నికల్లో నిలబి ఉంటే విజయం సాధించే వారేమో కాని ఆయన ఎన్నికల్లో నిలబడలేదు. ప్రస్తుతం పరిపాలనలో ఉన్న  టిడిపి - బిజెపి కూటమికి మద్దతు ఇచ్చి వారి గెలుపుకు సహకరించాడు.


ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్


కాగా ఇటీవల అధికారికంగా జనసేన రిజిస్టర్డ్ పార్టీ కావడంతో ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.  మరి ఒకవేల పోటీలో నిలబడకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయనే ఆలోచనలో కూడా ఉన్నారు. అంతే కాదు తెలంగాణలో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరియు సనత్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.  ఈ సారి పోటీలో స్వయంగా పవన్ కళ్యాన్ నిలబడే యోచనలో ఉన్నారట.  హైదరాబాద్ లో సెటిలర్స్ ఎక్కువగా ఉండటం వల్ల తప్పక ప్రభావం చూపుతామని భావిస్తున్నాడట పవన్ . ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే తెలంగాణలో ఆయన ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: