కుష్బూ ఒకప్పుడు తమిళ అభిమానుల ఆరాధ్య దేవత. ఈమె కోసం గుడి కట్టించిన అభిమానులు కూడా ఉన్నారు. ఖుష్బూ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వస్తున్నారు. తెలుగులో కూడా అడపా దడపా సినిమాల్లో వస్తుంది. అలాంటిది తమిళనాడు కాంగ్రెస్‌లో సినీతార కుష్భూ హంగామా సృష్టిస్తోంది. ఒక్కసారిగా సినీ నటి కుష్బూ తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అతి ముఖ్యమైన నాయకురాలు అయిపోయారు. కాబోయే ముఖ్యమంత్రి అందరూ అంటున్నారు. అధికార ప్రతినిధిగా ప్రకటించిన వెంటనే ఆమెపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.


కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతున్న సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు


 తమిళనాడు  రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ఈవికెస్ఎస్ ఇలంగోవన్ కుష్బూను చాలా గొప్పగా అభివర్ణించారు. తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా స్థానిక నేతలు కాబోయే సిఎం కుష్బూ అంటూ నినాదాలు చేశారు. భూసేకర చట్టానికి వ్యతిరేకంగా, ఆ చట్టానికి మద్దతు ఇస్తున్న అన్నాడియంకె ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ  ఖుష్బూ నాయకత్వం వహించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడ్డా కుష్బు మంత్రి కావడం తథ్యమని ప్రకటించేశారు. ఈ ప్రకటన వినడానికి బాగానే ఉన్నా, కాంగ్రెస్‌లోని గ్రూపు నేతలు మాత్రం  కారాలు మిరియాలు నూరే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుచ్చి వేదికగా జరిగిన నిరసన సభలో ఏకంగా అక్కడి నాయకులు కాబోయే సీఎం కుష్బు అని నినదిస్తూ, సీఎం పదవికి ఆమె అర్హు రాలిగా ప్రకటిస్తూ నినాదాలు హోరెత్తించడం గమనార్హం.

తర్వాత  నిరసనను ఉద్దేశించి కుష్బు ప్రసంగిస్తూ, కేసుల నుంచి బయట పడేందుకే భూ సేకరణ చట్టానికి అన్నాడీఎంకే మద్దతు ప్రకటిం చిందని ఆరోపించారు. ఎన్టీయే పని తీరుపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు ఆ సమయంలో   కుష్బు సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. తర్వాత మీడియా కుష్బు ను కదలించింది. తమరిని కాబోయే సీఎంగా పేర్కొంటున్నారే, ఆ పదవికీ తమరు అన్ని రకాల అర్హులుగా వ్యాఖ్యానిస్తున్నారని గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేందుకు అవకాశం ఉందని, ఎవరికి వారు తమ అభిప్రాయాలతో కూడిన ప్రసంగాలు చేస్తుంటారని అవన్నీ సీరియస్ గా తీసుకోకూడదని ఆమె అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: