అధికారపగ్గాలు అందుకున్న తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబుకు మొట్టమొదటిసారి ఎలక్షన్ షాక్ తగిలింది. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ హవాయే కొనసాగుతుంది. అధికారానికితోడు అన్ని విధాలా బలంగా ఉండటం పవర్ లో ఉన్నవాళ్లకు ప్లస్ అవుతుంది. అలాంటింది అధికార పార్టీ ఓడిపోయిందంటే అది బిగ్ షాక్ కాక మరేంటి..?

ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్ధి రామసూర్యారావు.. టీడీపీ అభ్యర్ది చైతన్య రాజును ఓడించారు. సూర్యారావు కు అవసరమైన 8496 ఓట్లు రావడంతో సూర్యారావు గెలిచారు. టీడీపీ బలంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో వ్యతిరేక ఫలితం రావడంతో తెలుగుదేశానికి దిమ్మతిరిగినట్టైంది.  

ఉభయగోదావరి జిల్లాల్లో తెలుగుదేశం ఓటమికి అనేక కారణాలు చెబుతున్నారు. ఇక్కడ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి చైతన్య రాజు ట్రాక్ రికార్డు అంత బాగా లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉండి.. ఆ తర్వాత పసుపు కండువా వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కు విప్ పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చారు. 

పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ అభ్యర్ది ఓటమిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫుల్ ఫైర్ అయ్యారట. పార్టీ ఎమ్మెల్యేలను సమావేశపరచి కారణాలపై నిలదీశారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలను దాదాపు స్వీప్ చేసిన సంగతి తెలిసింది. ఏడాది తిరగకుండానే ఇలాంటి షాక్ ఎదురుకావడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: