తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్.. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఈ డైలాగ్ ను విపరీతంగా వాడుకున్నారు. ఒక్క స్లోగన్ తో రెండు ప్రధాన పార్టీలను ఆయన ఇరుకున పెట్టేశారు. డైలాగ్ కూడా వినడానికి రిథమిక్ గా ఉండటంతో బాగా పేలింది. దీనికి తోడు దొంగబ్బాయి - మొద్దబ్బాయి.. అంటూ జగన్-రాహుల్ ను కలగలిపి విమర్శించడం కూడా బాగా క్లిక్కైంది. 


జగన్ కు బాగా కోపం వచ్చేసింది


ఇప్పుడు అదే మాట ఆంధ్రా అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ నేతలు పదే పదే తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తుంటే.. ప్రతిపక్షనేత జగన్ కు బాగా కోపం వచ్చేసింది. తమను పిల్ల కాంగ్రెస్ అని విమర్శించడంపై ఆయన అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. తాము ఎన్నడూ అధికారంలోకి రాలేదని.. స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని పట్టుబట్టారు. 


కిరణ్ సర్కార్లకు టీడీపీయే మద్దతిచ్చి కాపాడిందని


రోశయ్య సర్కారు, కిరణ్ సర్కారు, తెలుగు కాంగ్రెస్ సర్కారు ( చంద్రబాబునుద్దేశించి..) మాత్రమే ఉన్నాయని.. వైసీపీ సర్కారు ఇంకా ఏర్పడలేదని సెటైర్లు వేశారు. రోశయ్య, కిరణ్ సర్కార్లకు టీడీపీయే మద్దతిచ్చి కాపాడిందని గుర్తు చేశారు. జగన్ దూకుడుతో డిఫెన్సులో పడ్డ టీడీపీ తన వ్యాఖ్యలను సమర్థించుకోవాలని ప్రయత్నించింది. కాంగ్రెస్ లో ఉన్నవారే ఈ వైసీపీలోనూ ఉన్నారని అందుకే పిల్ల కాంగ్రెస్ అంటున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 


చంద్రబాబు మూలాలు బయటపెట్టారు


జగన్ ఆ ప్రయత్నాన్ని కూడా సమర్థంగా తిప్పికొట్టారు. అలా చూస్తే.. మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడని చంద్రబాబు మూలాలు బయటపెట్టారు. అంతేకాదు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 మంది కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చిన అంశాన్నీ ప్రస్తావించేసరికి టీడీపీ నేతలు డిఫెన్సులో పడిపోయారు. మొత్తంమీద తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ సభలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: