మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వేడెక్కుతున్నాయి. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సహజనటి జయసుధలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ.. కళాకారుల పరువును, ప్రతిష్టను బజారుకు ఈడ్చారు. చిత్ర పరిశ్రమలో సహృదయ వాతావరణాన్ని ఈ ఎన్నికలు కలుషితం చేశాయని పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'మా'లో రాజకీయ నాయకుల జోక్యం తీసుకురావోద్దని జయసుధ ఆరోపణలు చేయడం, వాటిని రాజేంద్ర ప్రసాద్ ఖండించడం తెలిసిన విషయమే. జయసుధ వర్గం బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.

మరో ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తుంది. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ 'మా' ఎన్నికలలో సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారట. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో జయసుధ రాజకీయాలలో అడుగుపెట్టారు. కానీ, ప్రస్తుతం ఆమెకు మద్దతునిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంపి. ఆమె జగన్ మద్దతు ఎందుకు కోరతారు అనేది ఆసక్తికరమైన ప్రశ్న. మరోవైపు గెలవడానికి ఎ ఒక్క అవకాశాన్ని వృధా చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ వెనుక మురళీమోహన్ ఉన్నారు కనుక రాజేంద్ర ప్రసాద్ జగన్ వద్దకు వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. అందువల్ల ఎవరికి మద్దతుగా జగన్ రంగంలోకి దిగారు అనే విషయంలో స్పష్టత లేదు. ఈ వార్తలో సత్యం ఎంత..? అనేది కూడా అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: