రాజధాని భూ సేకరణ, నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ గరంగరంగా జరిగింది. సభ బుధవారం ప్రారంభం కాగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు రాజధాని భూ సేకరణ, నిర్మాణంపై ఇచ్చిన వాయి దా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ప్రధాన సమస్యగా రాజధాని భూ సేకరణ జరిగిందని, దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారని, చర్చకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యు లు పట్టుపట్టారు. ఇందుకు స్పీకర్‌ అంగీకరించకుండా వేరే రూపంలో రావాలని చెప్పారు. దీంతో సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని సభ మూడు రోజులే ఉందని, సంక్షేమంపై చర్చ జరగాల్సి ఉన్నందున అందుకు సహకరించాలన్నారు. మరో మంత్రి ఉమామహేశ్వరావు కల్పించుకుని ప్రతిపక్షం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ సభను అడ్డుకుంటోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. స్పీకర్‌ మాట్లాడుతూ గతంలో దీనిపై చర్చ జరిగినందున దాన్ని మళ్లీ పునర్చశ్చకు తేవడం ఎంత వరకూ సమంజసమన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ కాల్వ శ్రీని వాసులు మాట్లాడుతూ రెడ్డొచ్చి మొదలు అన్నట్లుగా ప్రతి పక్షనేత జగన్‌ వైఖరి ఉందని విమర్శించారు.నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వీళ్ల దుర్మా ర్గాన్ని ప్రజలు చూస్తున్నారని, ప్రతీ రోజూ తప్పుమీద తప్పు చేస్తున్నారని చెప్పారు.

ఇంకొక మంత్రి రావెల కిషోర్‌బాబు కల్పించుకుని గిరిజనులు, దళితులకు సంబంధించిన డిమాం డ్లపై చర్చ జరుగుతుందని ఎదురు చూస్తున్నారని, ప్రతిపక్ష వైఖరితో వారికి నిరాశ కలుగుతోందన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనలను విరమించ లేదు. దీంతో స్పీకర్‌ సభను 9.12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి 9.41 గంటలకు ప్రారంభం కాగానే వైఎస్సార్‌ సీపీ సభ్యులు రాజధాని భూ సేకరణపై తమ ఆందోళనలను కొనసాగిం చారు. స్పీకర్‌ అనుమతితో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దీనిపై తాము 344 సెక్షన్‌ కింద చర్చకు గతంలోనే నోటీసు ఇచ్చామన్నారు. బిల్లుపై డిశెంబర్‌లో చర్చ జరిగిందని తదుపరి భూ సేకరణ విషయంలో రైతుల ఇబ్బం దులను చర్చించాల్సి ఉందన్నారు. తనతోపాటు, తమ పార్టీకి చెందిన 42 మంది సభ్యులు భూ సేకరణ విషయమై ఆయా ప్రాంతాల్లో పర్యటించామని, రైతులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదన్నారు. జగన్‌ మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ చేసి మంత్రి అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ ఐదు గంటల పాటు రాజధానిపై చర్చ జరిగిం దన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాజధాని ఎంపిక, లాండ్‌పూలింగ్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివాదం లేని అంశాన్ని వివాదాస్పదం చేయడం పద్దతికాదని చెప్పారు. మరో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ సభ్యుల యాత్రకు రైతుల నుండి మద్దతు లేదన్నారు. ప్రజా రాజధాని నిర్మాణా నికి ముందుకు వచ్చి ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు ప్రతిపక్ష సభ్యులు ఆందోళనలతో రాజధాని భూములపై చర్చ జరగాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మళ్లీ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో భూ సేకరణ విషయంలో రైతుల సమస్యలపై సభలో ఎక్కడా చర్చ జరగ లేదని స్పష్టం చేశారు. రైతుల నుండి బలవంతంగా ఏవిధంగా భూములు తీసుకున్నారనేది, రైతు కూలీలు, కౌలుదార్ల పరిస్థితిపై చర్చ జరగకపోతే ఎలా అని ప్రశ్నించారు. పోనీ చర్చకు ఎప్పుడు అనుమతిస్తారనేది చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ ఉపనాయకుడు జ్యోతుల నెహ్రు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం, భూ సేకరణపై రకరకాల అనుమానాలు ఉన్నాయని, అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇందుకు ప్రతిగా సభలో ప్రతిపక్షం తీరు సరిగ్గా లేకనే సభ జరగడం లేదని ప్రభుత్వ విప్‌ నరేంద్ర విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీలపై వివరణ ఇవ్వకుండానే ప్రతి పక్షం సభ నుండి వాకౌట్‌ చేయడాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా ప్రతిపక్షం అడ్డుప డుతోందన్నారు. నరేంద్ర చేసిన వ్యాఖ్యల పట్ల నెహ్రు అభ్యం తరం వ్యక్తం చేస్తూ నరేంద్ర మాకు పాఠాలు చెప్పాల్సిన అవస రం లేదని, సభలో ప్రతిపక్ష సభ్యుల అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే తాము సభ నుండి మంగళవారం వాకౌట్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు. బాధ్యతారాహిత్యంగా అధికార పక్షం ఏకపక్ష ధోరణితో వెళుతోందని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని వ్యాఖ్యానించారు సమస్యలు లేవనెత్తితే తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని నెహ్రు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

శాసన సభ వ్యవహారాలను చూస్తే వాస్తవాలు తెలుస్తాయని తెలిపారు. ఇందుకు స్పీకర్‌ స్పందిస్తూ అధికార, ప్రతిపక్షాలు వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే సభ సజావుగా సాగుతుంద న్నారు. డిసెంబర్‌ 22వ తేదీన సిఆర్‌డీఎ బిల్లుపై చర్చ జరిగిందని చెప్పారు. అందువల్ల ఇప్పుడు చర్చ అవసరం లేదని తేల్చిచెప్పారు. జగన్‌ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన తాము రాజధాని భూ సేకరణపై 344 సెక్షన్‌ కింద నోటీసు ఇచ్చామన్నారు. శాసనసభ కార్యదర్శులను కూడా నమ్మె పరిస్థితి లేకపోవడంతో అప్పుడు తాము ఇచ్చిన నోటీసు జిరాక్సును తీసుకున్నామని దాన్ని సభలో చూపించారు. వీటికి స్పీకర్‌ స్పందిస్తూ నోటీసు ఇచ్చినవన్నీ చర్చకు రావాలంటే సాధ్యం కాదన్నారు. దీనిపై తాను రూలింగ్‌ ఇస్తున్నానని, గతంలో చర్చ జరిగినందున మళ్లీ చర్చ అవసరం లేదని స్పష్టం చేశారు. నరేంద్ర కల్పించుకుని న్యాయవ్యవస్థపైన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద, శాసనసభా వ్యవహా రాలపై ప్రతిపక్షనేతకు నమ్మకం లేదన్నారు. ఆయన నీడమీద జగన్‌కు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌రెడ్డి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వైఎస్సార్‌ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. దీంతో స్పీకర్‌ సభ ను 10.9 గంటలకు వాయిదా వేసి 11.01 గంటలకు తిరిగి ప్రారంభించారు. జగన్‌ మాట్లాడుతూ రాజధాని భూ సేకరణపై చర్చ జరగ లేదని, తాము నోటీసు ఇచ్చినా చర్చకు అనుమతిం చని పరిస్థితి ఉందని, వదలివేస్తున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: