ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం శాసనసభ ప్రాంగణంలోనే టిడిఎల్‌పి సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎంఎల్‌సీ ఎన్నికల ఫలితాల సరళి వెలువడింది. వెలువడిన సరళి ప్రకారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సీ ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్ది దాదాపు ఓటమి ఖాయమైంది.ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా అవమానంగా ఉందంటూ ముఖ్యమంత్రి తన ఆగ్రహాన్ని బాహాటంగానే వ్యక్తం చేయటంతో తమ్ముళ్ళు కిమ్మనలేకపోయారు.

అభ్యర్ధి ఎంపికలో తప్పు జరిగినట్లు తమ్ముళ్ళు మెల్లిగా నసిగారు. దాంతో చంద్రబాబుకు మరింత చిర్రెత్తుకొచ్చింది. అభ్యర్ది ఎంపికలో పొరబాటు జరిగినా, నాయకులు పనిచేయటంలో రాజీ పడకుండా ఉండాల్సిందంటూసిఎం గట్టిగా అన్నారు. అయితే, తెలంగాణాలో వెలువడు తున్న ఫలితాల సరళిని విన్న చంద్రబాబు సంతోషపడిపోయారు. ఎపిలో మంత్రులు, ఎంఎల్‌ఎలతో సమన్వయం చేసుకుని పనిచేయాల్సిందని సిఎం అభిప్రాయపడ్డారు ఇక, శాసనసభ వ్యవహరాల గురించి మాట్లాడుతూ, సభలో తమ పనితీరు మెరుగుపడిందని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇసుకపై కాంగ్రెస్‌ పాలనతో ఏడాదికి రూ. 60 కోట్లు ఆదాయం వచ్చేదని, కొత్త విధానం కారణంగా ఐదు నెలల్లోనే రూ. 320 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.ఈ ఆదాయాన్ని చూపి బ్యాంకుల్లో రుణాలు తీసుకుందామని, ఆ రుణాలతో డ్వాక్రా రుణాలమాఫీ చేద్దామని సిఎం సూచించా రు.మరోవైపుశాసనసభలో జరుగు తున్న పరిణామాలపై అధికార పార్టీతో రాజీకి వచ్చేం దుకు సిద్ధమని ప్రతిపక్ష వైఎ స్‌ఆర్‌సిపిసిద్దపడుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయడు సీఎం దృష్టికి తెచ్చారు. స్పీకర్‌పై చేసి నవ్యాఖ్యల ను వెనక్కు తీసుకోవటం ,సభా హక్కుల నోటీసుల ను కూడా ఉపసంహరించుకునే విష యాలను కూడాప్రతిపక్షం ప్రస్తావిస్తు న్నట్లు మంత్రి చెప్పగానే, సిఎం వెంటనే చర్చనుపక్కదారిపట్టించారు.ఆ విష యాల నుఇక్క డ చర్చించటం కుదరదని మళ్ళీ చర్చిద్దామంటూ అచ్చెన్నాయ డుకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: