ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 

Image result for ap assemblyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో వద్దు వద్దన్నా.. ఈ రెండింటి మధ్యా పోలిక వస్తోంది. ఈ పోలిక పెట్టుకొని తాము అద్భుతంగా సభను నిర్వహిస్తున్నామని ప్రకటించాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు. కేవలం అలా ప్రకటించుకోవడమే గాక.. తాము సభా నిర్వహణలో కొత్త  రికార్డులను కూడా సృష్టించామని ఈ నేత చెప్పుకొచ్చాడు!

 

మరి ఏమిటా రికార్డు.. అంటే తక్కువ రోజులు సభను నిర్వహించి ఎక్కవ పనిగంటలను నమోదు చేయించడమే ఆ రికార్డు అని హరీష్ రావు చెప్పుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ రికార్డు నమోదయ్యిందని ఆయన చెప్పుకొచ్చాడు. సాధారణంగా శాసన సభ సమావేశాల్లో చాలా సమయం వృథా అవుతూ ఉంటుంది. అయితే తమ ప్రభుత్వ హయాంలో మాత్రం అలాంటి వృథా జరగడం లేదని.. ఎక్కువ సమయం సద్వినియోగం అవుతోందని హరీష్ రావు అంటున్నాడు.


ఇంకా పరిశీలించలేదు కానీ.. ఓవరాల్ గా చూసుకొంటే తక్కువ రోజుల్లో ఎక్కువ పనిగంటలు సద్వినియోగం చేసిన ఘనత తమదేని ఈ తెరాస నేత చెప్పుకొన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ కి చోటు లేకుండా పో యింది! సమావేశాల ప్రారంభ సమయంలో స్పీకర్ వారిని బయటకు పంపించాడు. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సభలోకి అడుగుపెట్టనీయకుండా చేశాడు!


దీంతో ఆ రోజు నుంచి తెలుగుదేశం వాళ్లు తమకు అన్యాయం జరిగిందని అంటూ.. క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నా సభలోకి రానివ్వడం లేదంటూ గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకూ అందరికీ ఫిర్యాదు చేయడంలోనే గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో తెలుగుదేశం నేతల అల్లరి లేకుండా పోయింది. కాంగ్రెస్ వాళ్లు ఉన్నా.. సభా సమయానికి పెద్దగా ఆటంకాలు ఏర్పడటం లేదు. దీంతో తెరాస వాళ్లు తక్కువ పనిదినాల్లో ఎక్కువ గంటలు పనిచేసిన రికార్డును సృష్టించి ఉండవచ్చు!


మరింత సమాచారం తెలుసుకోండి: