నేటి నవీన కాలంలో చదువు చాలా క్లిష్టతరమైన బాధ్యత అయ్యింది. పూర్వ కాలంలో రుషులు వద్దకు పిల్లల్ని పంపించే వారు అక్కడ పిల్లలు చక్కటి విద్యలు నేర్చుకొని ప్రయోజకులు అయ్యాకే ఇంటికి వచ్చి వారి కుటుంబాన్ని ఉద్దరించే వారు. కానీ నేడు దానికి పూర్తి భిన్నమైంది. పిల్లలు చదువుకోవాలంటే వారికంటే ముందు తల్లిదండ్రులు ప్రిపేర్ కావల్సి వస్తుంది. తమ జీవింతో పిల్లల చదువు కోసమే సగం గడపాల్సి వస్తుంది.


పిల్లల్ని ప్రిపరేషన్ చేసేటపుడు దగ్గరుండి శ్రద్ద తీసుకోవాలి


ఇక వార్షక పరీక్షలొస్తున్నాయంటే చాలు..పిల్లలకే కాదు..పెద్దవాళ్లకూ తలకు మించిన భారం అవుతుంది.  ఈ క్రమంలో పరీక్షలు ఎలా రాస్తామో? అని పిల్లలు, మా పిల్లలకు మొదటి ర్యాంకు వస్తుందో? రాదో? అని వారి తల్లిదండ్రులు ఇలా ఎవరికి వారే మానసిక ఆందోళకు గురవుతుంటారు. ఇలాంటి ఒత్తిళ్ల వల్ల అనుకున్న ఫలితం దక్కకపోగా..పిల్లల ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ప్రణాళికతో తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షలకు సంసిద్ధం చేస్తే...అటు పిల్లలు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

ముందుగా   పరిక్ష ఎప్పుడు అని తెలుసుకోవాలి  పిల్లల్ని పరీక్షలకు ప్రిపేర్ చేసే క్రమంలో ముందుగా వారి పరీక్షల టైమ్ టేబుల్ ను ఓసారి చూడండి. తద్వారా ఏ పరీక్ష ఎప్పుడెప్పుడు ఉందో తెలుసుకోవచ్చు. దానికి తగినట్టుగా ఉన్న సమయాన్ని బట్టి ఏ పరీక్షకు ఎన్ని రోజులు కేటాయించాలనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆ తర్వాత అన్ని సబ్జెట్టులు చదవడానికి సమయం బాగా కలిసివచ్చేలా ఒక ప్రణాళిక తయారుచేయాలి.   


ముందుగా ఏ పరీక్షలు ఉన్నాయో వాటిపై దృష్టి సారించి పరిక్షలకు సిద్ద చేయాలి


తర్వాత ఎందులో వీక్ అని తెలుసుకోండి? అందరు పిల్లలూ అన్ని సబ్జెక్టుల్లో ఆరితేరి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ప్రణాళిక సిద్దం చేసేటప్పుడు ఈ విషయాన్ని ద్రుష్టిలో ఉంచుకోవాలి. దీనికి అనుగుణంగానే..బాగా వచ్చిన సబ్జెక్టుకు కాస్త తక్కువ సమయం, నైపుణ్యం అంతగా లేని సబ్జెక్టులకు కాస్త ఎక్కువ సమయం కేటాయించేలా ప్లాన్ చేయండి. ఇలా రోజులో అన్ని సబ్జెక్టులకు సమయం సరిపోయేలా ప్రణాళిక ఉండడం మంచిది. ఎందుకంటే ఒక రోజు ఒకే సబ్జెక్టు చదవడం అంటే పిల్లలకు కూడా బోర్ గానే ఉంటుంది.


చక్కగా ప్రిపేర్ చేయించి పిల్లల్ని పరిక్షలకు పంపించాలి


  రాత్రుళ్ళు త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేచేలా పిల్లలకు అలవాటు చేయాలి. ఎందుకంటే రాత్రి కంటే ఉదయాన్నే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చదివింది బాగా గుర్తుండే అవకాశ ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: