ఏపీ సీఎం చంద్రబాబు

Image result for chandra babu

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరు టీడీపీ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర మంత్రులు ఆగ్రహంగా ఉన్నారట. కేంద్రం నుంచి నిధులు రాబట్టే పనిలో వారు దారుణంగా విఫలమయ్యారని చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వారంలో ఒకట్రెండు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి.. ఇదిగో నిధులు, అదిగో నిధులు.. వచ్చేస్తున్నాయి.. అంటూ హడావుడి చేస్తున్నారు. మరో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజైతే అదీ చెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే మనం చేసేదేం లేదు అన్నట్లుగా ఉన్నారాయన. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఆరు రోజులే మిగిలాయి. పైగా అందులో రెండు రోజులు సెలవులు. అయినా విభజన అనంతరం కొత్త రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రం నుంచి ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. కేరద్ర మంత్రి సుజనా చౌదరి నిధులు వచ్చేస్తున్నాయంటూ చేస్తున్న ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ, ఆచరణలో రూపాయి కూడా రాకపోవడం రాష్ట్ర మంత్రుల్లో కొందరు దీనిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. 'సుజన ఏ ఆధారంతో అలా చెప్పారో తెలియదు. మాకైతే ఎటువంటి సంకేతాలు లేవు' అని రాష్ట్రానికి చెందిన సీనియర్‌ మంత్రి ఒకరు తాజగా వ్యాఖ్యానించడం విశేషం. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని... తమ కార్యాచరణను వారు ఒకసారి ప్రభుత్వానికి, పార్టీకి వివరిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏమీ చేయడం లేదని... వైసీపీతో తలపడుతున్నట్లుగా కేంద్రంతో పోరాడితే ఈసరికి నిధులు వచ్చేవని అంటున్నారు.

పివి రమేష్‌ను ఢిల్లీలో

Image result for p v ramesh tdp

కేంద్ర మంత్రి ప్రకటనల ఆధారంగా నిధులు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసిన ఆర్థికశాఖ అధికారులకూ ఈ పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్‌ను ఢిల్లీలో ఉండి నిధుల కోసం చివరి వరకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో రెండు రోజుల క్రితం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే, పరిస్థితేమీ అర్థం కావడం లేదని... ఈ ఆర్థిక సంవత్సారానికి ఇంతే అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

పోలవరం ప్రాజెక్టు నిధులు, సిఎస్‌టి పరిహారం 

Image result for polavaram project images

విభజన సాయం, కేంద్రం నుంచి సాధారణంగా రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్ కు  పెద్దమొత్తంలో అందాలి. రెవెన్యూ లోటు, రాజధాని నిర్మాణానికి 13వ ఆర్థిక సంఘం నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులు, సిఎస్‌టి పరిహారం వంటి అనేక రంగాలకు సంబంధిరచిన నిధులు రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఒక్క పైసా కూడా రాష్ట్ర ఖజానాకు చేరలేదు. రెవెన్యూ లోటు కింద ఇటీవల రూ. 500 కోట్లు ఇచ్చిన కేంద్రం తరువాత మరికొంత ఇస్తామని రెవెన్యూ లోటు కోసం ముందుగా రూ. పది వేల కోట్లు వస్తాయని చెప్పిన అధికారులు.. ఇప్పుడు రూ. 2500 కోట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి తక్షణం రూ. వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంది. 13వ ఆర్థిక సంఘం నురచి రావాల్సిన దాదాపు రూ. 1,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.2,500 కోట్ల వరకు సిఎస్‌టి పరిహారం కిరద రూ. 70 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇందులో ఒక్క రూపాయి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే, నిధుల సాధనలో విఫలమయ్యారని కేంద్ర మంత్రులను వేలెత్తి చూపిస్తున్న చంద్రబాబు తాను కూడా ఈ దిశగా చేసిన ప్రయత్నమేమీ లేదు. రాష్ట్రంలోని అసెంబ్లీలో విపక్షంతో ఢీ అంటే ఢీ అనడానికే ప్రాధాన్యమిచ్చిన ఆయన కేంద్రం దగ్గర మాత్రం తోక ముడుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: