గురువారం ఏపీ అసెంబ్లీ వాడీ వేడిగానే కొనసాగింది. అసెంబ్లీలో డీజిల్, పెట్రోల్‑పై వ్యాట్ పెంపు గురించి మాట్లాడారు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రప్రభుత్వం వ్యాట్‌ విధించడం సామాన్యులపై పెనుభారం పడుతోందన్నారు. ఈ సందర్భంగా    ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించామంటూనే ఒక పక్క వ్యాట్ విధిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. కనీ వినీ ఎరుగుని రీతిలో దేశంలో ఎక్కడా లేని విధంగా   ఆంధ్రప్రదేశ్‑లో అత్యధికంగా వ్యాట్‌ విధిస్తున్నారని అన్నారు.


శోభనాగిరెడ్డి మరణం తర్వాత పోటీలో నిలబడి ప్రచారం చేస్తున్న భూమ అఖిల ప్రియ


ఈ సందర్భంగా ఆమె రాబిన్ హుడ్ కథ చెప్పారు. రాబిన్ హుడ్ ధనవంతులను దోచి పేద ప్రజలకు పంచి పెట్టేవాడు. కానీ మన ప్రభుత్వం మటుకు దీనికి వ్యతరేకంగా పేద ప్రజలను దోచి ధనికులకు పంచి పెడుతున్నారు. అందుకే ప్రభుత్వానిన రాబింగ్ హుడ్ గా వ్యాఖ్యానించారు.  ఓ వైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం ఎంత వరకు న్యాయం అన్నారు.   రైతులు ట్రాన్స్‑పోర్టు ఖర్చులను భరించలేకపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్‑కు రావాల్సిన నిధులతో పాటు    ప్రత్యేకహోదా కోసం  అధికార, ప్రతిపక్షంతో పాటు స్పీకర్ సహా ...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి  సాధించుకుందామని అఖిలప్రియ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: