ఏపీ అసెంబ్లీ రగడ విషయాలు హాట్ హాట్ గా ఉండగానే జగన్ కి మరో షాక్ తగిలింది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని ఉమ్మడి రాష్ట్రంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ పైన అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. 


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జఫ్తు


ఇందుకు సంబంధించి ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు పలుమార్లు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు ఇందూ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జఫ్తు చేసింది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జఫ్తు చేసింది. ఇందూకు చెందిన రూ.132 కోట్ల ఆస్తులను జఫ్తు చేశారు. 


వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత నెల ఫిబ్రవరిలో మరో షాక్ 


గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,  ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గత నెల ఫిబ్రవరిలో మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. అప్పుడు మొత్తం రూ.232కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. జననీ ఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్ స్థలాలు, ఆస్తులను అటాచ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: