ఆంధ్రా అసెంబ్లీలో కొన్నిరోజుల క్రితం జరిగిన అధికార-ప్రతిపక్షాల జరిగిన వాగ్వాదం- వైసీపీ సభ్యుల ఆందోళన సమావేశాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లండి.. స్పీకర్ టేబుల్ పై చరచడం.. ఫ్యాక్షనిస్ట్ స్పీకర్ అంటూ నినాదాలు చేయడం.. సంచలనం కలిగించింది. 

సభాపతి స్థానాన్ని అవమానపరిచారంటూ టీడీపీ సభాహక్కుల నోటీసు ఇవ్వడం ఈ వివాదాన్ని మలుపు తిప్పింది. ఈ నోటీసు కారణంగా స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో.. వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గారు. గురవారం శాసనసభలో ప్రతిపక్షనేత జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పేశారు. 9 మంది సభ్యులూ క్షమాపణలు చెప్పారు.

ఇష్యూ క్లోజ్ అయినట్టే ఉన్నా.. స్పీకర్ ను కించపరిచిన సాక్షి టీవీపైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఘటన జరిగిన రోజు నుంచి సాక్షి టీవీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను పెద్ద పెద్ద అక్షరాలతో పదే పదే ప్రసారం చేసింది. యూ..కెన్ నాట్ స్పీక్ అని స్పీకర్ అనడాన్ని పదే పదే చూపించింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని కథనాలు వండివార్చింది. 

ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల క్షమాపణల నేపథ్యంలో సాక్షి టీవీపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు.. స్పీకర్ ను అగౌరవపరిచిన సాక్షిటీవీపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆయన ఒక్కడి డిమాండా.. లేక.. టీడీపీ మైండ్ లో ఉన్న గేమ్ ప్లాన్ లో అదీ ఒక భాగమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా సాక్షి టీవీపై చర్య తీసుకుంటే.. అది జగన్ కు ఇబ్బంది కలిగించే అంశమే. అయితే ప్రభుత్వం మీడియా జోలికి డైరెక్టుగా వెళ్లే అవకాశాలు తక్కువ.


మరింత సమాచారం తెలుసుకోండి: