సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, సభాపతి స్థానాన్ని కించపరిచినందుకు వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం శాసనసభలో క్షమాపణలు చెప్పారు. తెదేపా ఈమేరకు సభాహక్కుల నోటీసు ఇవ్వడంతో బహిష్కరణకు గురవడం కన్నా సారీ చెప్పేయడమే బెటరనే నిర్ణయానికి వైసీపీ వచ్చింది. ముందుగా అందరి తరపున ప్రతిపక్షనేత జగనే బేషరతుగా క్షమాపణ చెబుతున్నామని ప్రకటించేశారు. 


ఇకపై సభలో హుందాగా ప్రవర్తిస్తామని


జగన్ తోపాటు.. శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పి. అనిల్ కుమార్, బి.ముత్యాల నాయుడు.. ఇలా అంతా ఒక్కొక్కరుగా లేచి ఆనాటి ఘటనపై తమ విచారాన్ని, క్షమాపణను తెలియజేశారు. తెలిసో తెలియకో ఆవేశంలో అలా  ప్రవర్తించామని క్షమించాలని స్పీకర్ ను కోరుకున్నారు. ఇకపై సభలో హుందాగా ప్రవర్తిస్తామని మాట ఇచ్చారు. 


రోజు సభలో అందరికంటే ఎక్కువ


ఘటన జరిగిన రోజు సభలో అందరికంటే ఎక్కువ హడావిడి చేసిన రోజా మాత్రం క్షమాపణ చెప్పే విషయంలోనూ తన ప్రత్యేకత చాటుకుంది. అంతా క్షమాపణ చెబుతున్నాం అని కచ్చితంగా చెబితే రోజా మాత్రం.. క్షమాపణ అనే మాట అనకుండా తప్పించుకున్నారు. తండ్రివంటి మీకు క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం లేదు.. అంటూనే క్షమాపణ చెప్పకుండా దాట వేశారు.


స్పీకర్ ప్రవర్తనపై చురకలు అంటించింది


ఆనాటి ఘటనతో మీరు నొచ్చుకుని ఉంటే.. చింతిస్తున్నా.. అని క్షమాపణ చెప్పకుండా చింతించడంతో సరిపెట్టేసింది. క్షమాపణ చెప్పకపోగా.. విచారం వ్యక్తం చేసే సమయంలోనూ స్పీకర్ ప్రవర్తనపై చురకలు అంటించింది.  అందరినీ సమ దృష్టితో చూడాల్సిన తండ్రి.. ఒక బిడ్డను గారాబం చేసి.. మరో బిడ్డను పట్టించుకోకపోతే.. కోపంతోనే, అభిమానంతోనే తిరగబడతారని చెప్పడం ద్వారా స్పీకర్ అనుచితంగా ప్రవర్తించారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. రోజా మాటల్లో పశ్చాతాపం కంటే.. మొక్కుబడితనమే ఎక్కువ కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: