జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కొన్నిరోజుల క్రితం వరుస ఈవెంట్లతో హల్ చల్ చేశారు. మొదట చంద్రబాబును కలవడం.. ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించి.. ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచేశారు. అంతటితో ఆగకుండా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి.. కాంట్రావర్సీ కామెంట్లతో కన్ ఫ్యూజ్ చేసేశారు. 

రైతుల భూములు ఇష్టం లేకుండా ప్రభుత్వం తీసుకోవద్దన్న పవన్ కల్యాణ్.. వారి తరపున తాను పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. ఆంధ్రా కష్టాల్లో ఉందని.. తాను ఢిల్లీ వెళ్లి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడతానని కూడా చెప్పారు. రాజధాని ఇష్యూతోనైనా పవన్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నాడని చాలా మంది భావించారు. 

పవన్ రాజధాని రైతుల కోసం ఎప్పుడు పోరాటం చేస్తారు.. ఢిల్లీ వెళ్లి ఎన్డీఏతో ఎప్పుడు మాట్లాడతారని ఆయన అభిమానులు, రాష్ట్ర శ్రేయస్సు కోరే వారు అంతా ఎదురు చూశారు. చంద్రబాబు మాటకు విలువ ఇవ్వకపోయినా.. కనీసం పవన్ కల్యాణ్ యాత్రతోనైనా కేంద్రంలో కదలిక రావచ్చని భావించారు. 

కానీ ఇంతవరకూ పవన్ కల్యాణ్ తన తదుపరి కార్యాచరణ ప్రకటించలేదు. కనీసం ట్విట్టర్లోనూ పలకరించడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ యాత్ర ఉంటుందా ఉండదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ యాత్రకు ముహూర్తం కుదరలేదా.. ఫ్యూచర్ పై క్లారిటీ లేదా.. అన్నది తేలాల్సి ఉంది. పవన్ ఇలా మూడు నెలలకో.. ఆరునెలలకో ఓసారి స్పందిస్తాడన్న అపకీర్తి మూట కట్టుకుంటే.. ముందు ముందు ఆయన్ను నమ్మడం కష్టమే..



మరింత సమాచారం తెలుసుకోండి: