జర్మన్‌ వింగ్స్‌ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ 320 ప్రమాదానికి కోపైలటే కారకుడని గురువారం ఫ్రెంచ్‌ ప్రాసిక్యూటర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రెంచ్‌ అధికారుల ప్రకా రం కోపైలట్‌ కావాలనే ఈ విమానాన్ని కూల్చివేశాడని, అందులో ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడని అన్నారు. ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్‌‌స పర్వత ప్రాంతంలో అన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని ఒక్కసారిగా అంత తక్కువ అడుగుల ఎత్తులోకి దింపి ఈ విమాన దుర్ఘటనకు పాల్పడినట్లు బీబీసీ పేర్కొంది. జర్మన్‌ జాతీయుడైన కోపైలట్‌ ఆండ్రియాస్‌ లుబిట్జ్‌ వయస్సు 28 సంవత్సరాలు. సెప్టెంబర్‌ 2013న కోపైలట్‌గా వచ్చిన లుబిట్జ్‌కు కేవలం 630 గంటల అనుభవం మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా లుబిట్జ్‌కు టెర్రరిస్టులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలపై గురువారం జర్మన్‌ విదేశాంగ శాఖ మంత్రి థామస్‌ ద మెయిజియేర్‌ మాట్లాడారు. కోపైలట్‌కు టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు కానీ ఆ నేపథ్యం కానీ ఉన్నట్ల్లు తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు.ఫ్రెంచ్‌ ప్రాసిక్యూటర్‌ బ్రిస్‌ రోబిన్‌ మాత్రం కోపైలట్‌ లుబిట్జ్‌ కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మార్సెలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానం క్రమేపి కిందకు దిగిపోయే చివరి క్షణం వరకు లుబిట్జ్‌ శ్వాస తీసుకుంటన్నట్లు రికార్డు అయిన శబ్దాల ద్వారా తెలుస్తోందన్నారు. బ్లాకుబాక్స్‌లో 30 నిమిషాల పాటు రికార్డు అయిన దాని వివరాల ప్రకారం ప్రమాదం జరగబోయే కొద్ది నిమిషాలకు ముందుకు భయాందోళనలకు గురైన ప్రయాణికులు అరుపులు, కేకలు పెట్టారు. కాక్‌పిట్‌ వాయిస్‌ ప్రకారం కీలక సమాచారం లభ్యమైందని ఆయన అన్నారు. దాని వివరాల ప్రకారం పైలట్‌ టాయిలెట్‌లోకి వెళ్లిన సమయంలో అతడు బయటకు రాకుండా దాని తలుపును కోపైలట్‌ మూసివేశాడు.

దీంతో పైలట్‌ తిరిగి కాక్‌పిట్‌లోకి రాలేకపోయాడు. విచారణాధికారుల సమాచారం ప్రకారం వారికి లభ్యమైన బ్లాక్‌ బాక్సులలో ఒక దాని నుంచి మరికొన్ని విషయాలు తెలిసాయి. ప్రమాదం సంఘటన జరిగిన మరుసటి రోజున సీవీఆర్‌ ద్వారా వెలుగుచూసిన సమాచారం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుందని వారు అన్నారు. కాక్‌పిట్‌ నుంచి టాయిలెట్‌లోకి వెళ్లిన పైలట్‌ తిరిగి రాలేదు. ఎన్నిసార్లు టాయిలెట్‌ తలుపును లాగినా రాకపోవడంతో తలుపు తెరవమంటూ రెండు, మూడు సార్లు దానిపై గట్టిగా కొట్టినా కోపైలట్‌ స్పం దించలేదు. ఇవన్నీ వాయిస్‌ రికార్డులో ఉన్నాయని విచారణాధికారుల్లో ఒకరు తెలిపారు.కాక్‌పిట్‌లోని పైలట్‌ అసలు అక్కడి నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే సమాచారం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతకుముందు ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణలు ఆహ్లాదకరంగానే జరిగినట్లు సమాచారం. విచారణాధికారి రాబిన్‌ మాట్లాడుతూ మొదటి 20 నిమిషాల వారి సంభాషణ సాధారణంగా ఉంది. అయితే కోపైలట్‌ మాత్రం అన్నింటికి చాలా క్లుప్తంగా సమాధానాలివ్వడం గమనార్హమని రాబిన్‌ అన్నారు. డస్సెల్‌డోర్ఫ్‌లో ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉండమంటూ కోపైలట్‌కు చెప్పిన సమయంలో అతను అంత బాధ్యతాయుతంగా మాట్లాడినట్టుగా రికార్డులో లేదన్నారు. అదే సమయంలో సీటు వెనుకకు వెళ్లినట్టు, డోర్‌ పడినట్టు శబ్దాలు వినిపించాయన్నారు. ఎయిర్‌బస్‌ విమానాన్ని ఎన్నేళ్లుగా నడుపుతున్నది, తదితర విషయాలపై విచారణ జరుగుతోంది. పైలట్‌కు అపారమైన అనుభవం ఉన్నది, సుమారు 6,000 గంటలకు పైబడి విమానాలు నడిపిన అనుభవం ఉన్నది జర్మన్‌ వింగ్స్‌ సీఈఓ థామస్‌ వింకెల్‌మన్‌ అంతకుముందు చెప్పిన విషయం తెలిసిందే. అనుభవజ్ఞులైన ఇద్దరు పైలట్లు ఉండగా ఇంతటి ఘోర ప్రమాదం ఎట్లా జరిగిందనే దానిపై లుఫ్తాన్సా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. చెల్లాచెదురుగా మృతదేహాలు, విమాన శకలాలు ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్‌‌స పర్వతాల్లో కుప్పకూలిన జర్మన్‌ వింగ్స్‌ విమాన శకలాలు, మృతదేహాలు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు తిరిగి ప్రారంభ మయ్యాయి.

ప్రతికూల వాతావరణం కార ణంగా, సహాయక చర్యలకు కొంత సేపు అంతరాయం కలిగింది. విమానం కూలిన ప్రదేశం పర్వత ప్రాంతం కావ డంతో వందల మీటర్ల మేర విమాన శకలాలు, మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని సహాయక బృందాలు తెలిపాయి. కాక్‌ పిట్‌ వాయిస్‌ను స్వాధీనం చేసుకున్న సహాయక బృందాలు దానిని పారిస్‌ తర లించాయి. సీవీఆర్‌ చాలా వరకు దెబ్బతిందని, అయితే డేటా సేక రించడం కష్టం కాదని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు తెలిపాయి. 38 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న విమానం కేవలం ఎనిమిది నిమిషాల్లో ఆరువేల అడుగుల ఎత్తుకు ఎందుకు? పడిపోయింది అనేది తెలియాల్సి ఉంది. విమానం కిందికి వస్తున్నప్పుడు పొగలు కానీ, విస్ఫోటనం కానీ జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీవీఆర్‌ రికార్డర్‌ లభ్యమైనప్పటికీ, ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ దొరకలేదని, అది దొరికితే కానీ విమాన ప్రమా దంపై ఓ అంచనాకు రాలేమని అధికార వర్గాలు చెబు తున్నాయి. ప్రమాదం జరిగే ముందు పైలట్‌ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్‌ రాలేదని అధికారులు తెలిపారు. విమానం కూలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, దానిని అవలాంచి(మంచు తుపాను)గా భావించామని స్థానికులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశంలో పర్వతాల ఎత్తు మూడు వేల అడుగులని, అందు వల్ల సుశిక్షుతులైన సహాయక బృందాలను రంగంలోకి దించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.బహు:శ కావాలనే చేసి ఉండవచ్చుఎయిర్‌బస్‌ 320 ప్రమాద సంఘటనకు కోపైలట్‌ కారకుడంటూ ఫ్రెంచ్‌ విచారాణాధికారులు చేసిన వ్యాఖ్యలతో జర్మన్‌ వింగ్‌, లుఫ్తాన్సాల సీఈఓలు స్పందించారు. ఫ్రెంచ్‌ అధికారుల ప్రకటనలు మమ్మల్ని కలవరపరిచాయి. బహు:శ వారు చెప్పిందే నిజము కావచ్చని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని లుఫ్తాన్సా ట్విట్టర్‌లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: