ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దయ్యింది. వాస్తవానికి చంద్రబాబు బుధవారం రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అక్కడ సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని భౌతికకాయానికి నివాళి అర్పించి తిరిగి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకునేలా షెడ్యూలు రూపొందించారు. సింగపూర్ పర్యటన కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించింది.

అయితే ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే కార్యక్రమానికి హాజరవుతున్నందున అనుమతి ఇవ్వలేమని విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలిసింది.వాస్తవానికి సింగపూర్ ప్రభుత్వమే చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న విఐపిల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రధానులు, ప్రభుత్వ ప్రతినిధులకు తప్ప మిగిలిన వారికి అధికారిక హోదా కల్పించలేమని సింగపూర్ తేల్చి చెప్పినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: