ప్రస్తుతానికి సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వమే పెద్ద దిక్కులా కనిపిస్తోంది. టాలీవుడ్ మొత్తం హైదరాబాద్ లోనే సమీకృతం అయ్యి ఉండటంతో ఇక్కడ ప్రభుత్వం, అధికార పార్టీకి ఎంత దగ్గరగా ఉంటే సినిమా వాళ్లకు అంత మంచి జరిగే అవకాశం ఉంది. అందుకే వారు కూడా తెలివిగా తెరాస వాళ్లను, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యులను సినిమాల ఫంక్షన్లకు పిలుస్తున్నరు.


స్వయంగా హరీష్ రావు చెప్పుకొచ్చాడు.

Image result for harish rao

మరి టాలీవుడ్ వాళ్లు తెరాసను ఇలా వాడేసుకొంటున్నారనుకొంటే.. తెరాస వాళ్లు కూడా రివర్స్ లో సినిమా వాళ్లను వాడుకొంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ రావు చెప్పుకొచ్చాడు.  రుద్రమదేవి సినిమా ఆడియోవిడుదల వేడుకకు హాజరు కావడం గురించి ఆయన మాట్లాడుతూ..తను కొన్ని షరతుల మీద ఆ సినిమా వేడుకకు హాజరయ్యానని హరీష్ రావు చెప్పాడు.


మిషన్ కాకతీయ కార్యక్రమానికి 

Image result for mission kakatiya

రుద్రమదేవి సినిమా ఇంటర్వెల్ లో  మిషన్ కాకతీయ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వీడియోలను ప్రదర్శిస్తామని అంటేనే తను సినిమా ఆడియో విడుదల వేడుకకు వస్తానని ఆ యూనిట్ కు స్పష్టం చేశానని హరీష్ రావు చెప్పాడు. వారు ఆ షరతుకు అంగీకరించారని. .దాంతో ఆ సినిమా ఆడియోవిడుదల వేడుకకు హాజరయ్యానని హరీష్ రావు వివరించాడు. మరి రుద్రమదేవి సినిమాకు వెళ్లిన వారికి మిషన్ కాకతీయ యాడ్స్ కనిపిస్తాయనమాట! మరి బాగానే ఉంది హరీష్ రావు వాడకం! 


మరింత సమాచారం తెలుసుకోండి: