ఒక దృశ్యం కోట్లాది మందిని కదిలిస్తుంది! అవును.. ఒకే ఒక్క ఫోటోకు ఫేస్ బుక్ లో 30 లక్షల క్లిక్స్ పడ్డాయి. 3 లక్షల 50 వేల మంది షేర్ చేసుకున్నారు. 1 లక్షా 44 వేల మంది కామెంట్స్ చేశారు. ట్విట్టర్లో 6లక్షల 30 వేల మంది వీక్షించారు. నెటిజన్లకు హాట్ చర్చకు దారి తీసింది. బరాక్ ఒబామా రెండో సారి అధ్యక్షునిగా గెలిచిన తర్వాత అమితానందంతో భార్య మెషెల్లీని హత్తుకున్న దృశ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఒబామాను- మిచెల్లీ హగ్ చేసుకున్న ఈ ఫోటో అమెరికాలో మానవ సంబంధాలపై కొత్త చర్చకు దారి తీస్తోంది. అసలు ఈ ఫోటోపై వరల్డ్ వైడ్ నెటిజన్స్ ఏమనుకుంటున్నారు? ఈ ఇమేజ్ పై తమకు కలిగిన ఫీలింగ్ ను.. ఒక లక్షల 44 వేల మంది తమ కామెంట్స్ రూపంలో వ్యక్తపరిచారు. ఇక ట్విట్టర్లో ఈ అమేజింగ్‌..ఇమేజ్ ను ...6లక్షల 30 వేల మంది వీక్షించారు. ట్విట్టర్ చరిత్రలో.. మోస్ట్ పాపులర్ ట్వీట్ గా ఒబామా- మెషిల్లీ హగ్ కొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు ఫోట్ కింద ట్యాగ్ లైన్ గా ఉన్న ఫోర్ మోర్ ఇయర్స్‌ అన్న పదం.. మైక్రో బ్లాగింగ్ లో మోస్ట్ ఫెవరేట్ గా మారింది. ఇంతకీ ఈ దృశ్యంలో ఏం అద్భుతం ఉంది? ఈ ఇమేజ్‌ ఎందుకు అంతగా నచ్చింది? అని ప్రశ్నిస్తే.. అమెరికా.. యాంత్రిక ప్రపంచమని, అక్కడ మానవ సంబంధాలకు విలువ లేదని వరల్డ్ వైడ్ గా ఉన్న టాక్. అయితే ఈ దృశ్యం ఆ వాదనలకు భిన్నమనేది నెటిజన్ల ఒపీనియన్‌. అమెరికా లాంటి దేశంలోనూ భార్య భర్తల మధ్య బంధం ఇంత అద్భుతంగా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈ ఇమేజ్ ఆధారంగా హాలీవుడ్ లో సినిమాలు తెరకెక్కిచండానికి మూవీమేకర్లు అప్పుడు సన్నాహాలు మొదలు పెట్టడం కొసమెరుపు. 

మరింత సమాచారం తెలుసుకోండి: