తెలుగుదేశం వాళ్లు ఆ  అంశం గురించి మాట్లాడటం లేదు కానీ.. ఉభయగోదావరి జిల్లా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పెద్ద అంశమే! తెలుగుదేశం పార్టీ అక్కడ తన సర్వశక్తులనూ ఒడ్డి పోరాడింది. అన్ని రకాల బలాలనూ ప్రయోగించుకొని ఎమ్మెల్సీ సీటును సొంతం చేసుకొందామని ప్రయత్నించింది. అయితే అది సాధ్యం కాలేదు. రాజకీయ పార్టీల మద్దతు లేని యూటీఎఫ్ అభ్యర్థి ఘనవిజయం సాధించాడు.. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కష్టపడ్డ తీరును..వచ్చిన ఫలితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్య రాజు

Image result for chaitanya raju mlc

టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్య రాజును గెలిపించాలని తెలుగుదేశం అధినేత తనయుడు నారా లోకేష్ బాబు స్వయంగా బరిలోకి దిగాడు. ఈ మేరకు ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాడు. చైతన్య రాజు గెలుపుకోసం అందరూ కష్టపడాలని ఆయన పిలుపునిచ్చాడు. అయితే అది వృథా పోయింది. నారా లోకేష్ బాబు వంటి నేత బరిలోకి దిగినా.. చైతన్య రాజు గెలవలేకపోవడం నిజంగా తెలుగుదేశం పార్టీ కి అవమానమే!

టీడీపీ విజయం కోసం

Image result for tdp

అంతేనా.. క్షేత్రస్థాయిలో విచారిస్తే టీడీపీ విజయం కోసం చాలా కష్టపడ్డట్టే తెలుస్తోంది. టీచర్లను సామాజికవర్గం పరంగా.. ఆకట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా  భారీ గా ఖర్చు కూడా పెట్టినట్టుగా ఆరోపణలున్నాయి. ల్యాప్ టాప్ లు, వెండి పళ్లేలు.. డబ్బు పంపకాలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది! మరి ఇవన్నీ కూడా యూటీఎఫ్ అభ్యర్థిని ఓడించడానికి పనికిరానట్టున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికలు టీడీపీకి ఒకింత డేంజర్ బెల్స్ లాగానే ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: