ఆ మధ్య ఏపీ అసెంబ్లీలో చెలరేగిన దుమారం అందరికీ తెలుసు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, దుర్భషలాడటం మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చేసుకోవడం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైఎస్సార్ సీపీ తెలుగు దేశం పార్టీకి ఏక పక్షాని నిలుస్తున్నారని అవిశ్వాస తీర్మాణం పెట్టారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్‌పై అవిశ్వాసం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపాదన తీసుకు వచ్చారు. అంతకుముందే ఈ అంశంపై విష్ణుకుమార్‌ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించారు. 


అసెంబ్లీలో పాలక పక్ష నేత సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్


సభ అంటే తాము గౌరవం ఉందని సభా పతి అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉందని అది ఏపార్టీకి చెందిన వారైనా అక్కడ కూర్చున్న వారు పెద్దవారే అవుతారని జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అవిశ్వాసంపై వైసీపీ వెనక్కి తగ్గింది. దీనిపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సభాపతి పైన అవిశ్వాసం తీర్మానం నోటీసు తాము ఉపసంహరించుకుంటున్నామి చెప్పారు.

దీంతో ఏప్రిల్ 4వ తేదీన శాసన సభ ప్రత్యేక సమావేశం లేదని సభాపతి చెప్పారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు తాము సహకరించామని, అసెంబ్లీలో ప్రజా పక్షాన తాము నిలబడ్డామని కానీ  ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని తాము అవిశ్వాసం పెట్టామన్నారు. స్పీకర్‌ను దించేయాలన్న ఉద్దేశ్యం తమకు ఏ కోశానా లేదన్నారు. అవిశ్వాసం తమకున్న చివరి ఆప్షన్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: